Last Updated:
సాంబ్రాణి పొగతో తడి జుట్టును ఆరబెట్టుకోవడం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. అయితే దీనివల్ల జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది లేదా చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు నయమవుతాయి అనే విషయాలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలి.
ఒకప్పుడు హెయిర్ డ్రయర్లు, స్ట్రెయిటెనర్లు, హీట్ స్టైలింగ్ టూల్స్, రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండేవి కావు. అయినప్పటికీ మన అమ్మమ్మలు, నానమ్మలు జుట్టును సహజ పద్ధతుల్లోనే సంరక్షించుకునేవారు. అలాంటి సంప్రదాయ పద్ధతుల్లో తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు సాంబ్రాణి ధూపం వేయడం కూడా ఒకటి. సాంబ్రాణి పొగతో తడి జుట్టును ఆరబెట్టుకోవడం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. హెచ్ఈఎం వెబ్సైట్లో ప్రచురించిన కథనం ప్రకారం అయితే దీనివల్ల జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది లేదా చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు నయమవుతాయి అనే విషయాలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలి.

