ప్రభన్యూస్

Ruhani Sharma: ‘ఆకాశంలో ఒక తార’ సినిమా.. బిజిలీ పాత్రలో కనిపించనున్న రుహాని శర్మ…! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఈ వారం విడుదల కాబోతున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.

News18
News18

ఈ వారం విడుదల కాబోతున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్‌లు గట్రా సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా.. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాలో రుహానీ శర్మ కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ సినిమాలో రుహాని శర్మ బిజిలీ అనే రోల్‌లో నటించింది. కాగా.. రీసెంట్‌గా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రుహాని శర్మ స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సినిమా కథకు తాను పర్సనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాయని చెప్పింది. ఈ కథలో అమ్మాయిలాగే తాను కూడా హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక విలేజజ్ నుంచి వచ్చానని చెప్పింది. తాను హీరోయిన్‌గా మారి ఇప్పుడు ఇలాంటి వేదికపై నిలబడి మాట్లాడతానని ఎవరైనా అప్పుడు చెప్పుంటే మాత్రం అస్సలు నమ్మేదన్నా కాదని… పరిస్థితుల కారణంగా మన కల్ని చిన్నవి చేసుకోకూడదని చెప్పుకొచ్చింది.

ఈ సినిమాలో బిజిలీ అనే రోల్‌లో నటిస్తున్నానని.. ఈ క్యారెక్టర్‌ను చాలా ఇష్టపడి చేసినట్లు తెలిపింది. తన పాత్ర నిడివి ఎంతుంది అనేదాని కంటే కూడా కూడా.. తాను చేసిన పాత్ర కథకు ఎంత కీలకం అని చూసుకుని సినిమా కథకు ఒకే చెప్తానని.. అందుకే ఈ రోల్ చేసినట్లు చెప్పుకొచ్చింది. మీ అందరూ కూడా ఈ సినిమాను బాగా ఇష్టపడారని.. తన పర్ఫార్మెన్స్‌ను కూడా లైక్ చేస్తారని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రుహాని శర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాను స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి వంటి సినిమాలు తీసిన పవన్ సాదినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సైన్స్ ఫిక్సన్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది.

కల్పన అలియాస్ సాత్విక వీరవల్లి అనే అమ్మాయి ఓ మారుమూల పల్లెటూరిలో జన్మిస్తుంది. చిన్నప్పటి నుంచే చదువులో టాపర్. జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించినా.. ఆమె కుటుంబం నుంచి ఆశించిన ప్రోత్సాహం లభించదు. అయితే కల్పన మాత్రం వ్యోమగామిగా మారి అంతరిక్షంలోకి వెళ్లాలి అని కలలు కంటుంది. కానీ ఆ కలలకు కల్పన తల్లిదండ్రులు బ్రేకులు వేసి పెళ్లి చేస్తారు. అప్పుడు ఆమె జీవితంలోకి కృష్ణ అలియాస్ దుల్కర్ సల్మాన్ వస్తాడు. భార్య కలను.. తన కలగా మార్చుకొని ఆమెకు అండగా నిలుస్తాడు. కల్పనను వ్యోమగామి చేసి అంతరిక్షంలోకి పంపాలని ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అన్నదే ఈ సినిమా కథ అని టీజర్, ట్రైలర్‌తో కాస్త క్లారిటీ వచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 3:34 pm Digital Edition : Prabhanews
Ruhani Sharma: ‘ఆకాశంలో ఒక తార’ సినిమా.. బిజిలీ పాత్రలో కనిపించనున్న రుహాని శర్మ…! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 17, 2026 3:14 PM ISTఈ వారం విడుదల కాబోతున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. News18ఈ వారం విడుదల కాబోతున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్‌లు గట్రా సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా.. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాలో రుహానీ శర్మ కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాలో రుహాని శర్మ బిజిలీ అనే రోల్‌లో నటించింది. కాగా.. రీసెంట్‌గా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రుహాని శర్మ స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సినిమా కథకు తాను పర్సనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాయని చెప్పింది. ఈ కథలో అమ్మాయిలాగే తాను కూడా హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక విలేజజ్ నుంచి వచ్చానని చెప్పింది. తాను హీరోయిన్‌గా మారి ఇప్పుడు ఇలాంటి వేదికపై నిలబడి మాట్లాడతానని ఎవరైనా అప్పుడు చెప్పుంటే మాత్రం అస్సలు నమ్మేదన్నా కాదని... పరిస్థితుల కారణంగా మన కల్ని చిన్నవి చేసుకోకూడదని చెప్పుకొచ్చింది.ఈ సినిమాలో బిజిలీ అనే రోల్‌లో నటిస్తున్నానని.. ఈ క్యారెక్టర్‌ను చాలా ఇష్టపడి చేసినట్లు తెలిపింది. తన పాత్ర నిడివి ఎంతుంది అనేదాని కంటే కూడా కూడా.. తాను చేసిన పాత్ర కథకు ఎంత కీలకం అని చూసుకుని సినిమా కథకు ఒకే చెప్తానని.. అందుకే ఈ రోల్ చేసినట్లు చెప్పుకొచ్చింది. మీ అందరూ కూడా ఈ సినిమాను బాగా ఇష్టపడారని.. తన పర్ఫార్మెన్స్‌ను కూడా లైక్ చేస్తారని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రుహాని శర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాను స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి వంటి సినిమాలు తీసిన పవన్ సాదినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సైన్స్ ఫిక్సన్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది.కల్పన అలియాస్ సాత్విక వీరవల్లి అనే అమ్మాయి ఓ మారుమూల పల్లెటూరిలో జన్మిస్తుంది. చిన్నప్పటి నుంచే చదువులో టాపర్. జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించినా.. ఆమె కుటుంబం నుంచి ఆశించిన ప్రోత్సాహం లభించదు. అయితే కల్పన మాత్రం వ్యోమగామిగా మారి అంతరిక్షంలోకి వెళ్లాలి అని కలలు కంటుంది. కానీ ఆ కలలకు కల్పన తల్లిదండ్రులు బ్రేకులు వేసి పెళ్లి చేస్తారు. అప్పుడు ఆమె జీవితంలోకి కృష్ణ అలియాస్ దుల్కర్ సల్మాన్ వస్తాడు. భార్య కలను.. తన కలగా మార్చుకొని ఆమెకు అండగా నిలుస్తాడు. కల్పనను వ్యోమగామి చేసి అంతరిక్షంలోకి పంపాలని ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అన్నదే ఈ సినిమా కథ అని టీజర్, ట్రైలర్‌తో కాస్త క్లారిటీ వచ్చింది.మరింత చదవండి

Source link