బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో నిలిచారు. విభిన్నమైన కథలు, బలమైన పాత్రలను ఎంచుకునే ఆమె.. సినిమాల్లోనే కాకుండా సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తుంటారు. తాజాగా వయసు పెరగడం, మహిళల శారీరక మార్పులు, లైంగికత, మాతృత్వం వంటి అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

