2023-24 నుంచి 2025-26 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో మరో 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని 2024 జూలైలోనే పూర్తి చేశారు. దీంతో పథకం కింద మొత్తం కనెక్షన్ల సంఖ్య 10.35 కోట్లకు చేరింది. ఇప్పుడు ఉజ్వల యోజన కింద మరో 25 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఈ పథకం కింద మొత్తం లక్ష్యం 10.6 కోట్ల కనెక్షన్లకు చేరింది. ఈ కొత్త కనెక్షన్లను ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. ఇక 2026 సెప్టెంబర్ 23 నాటికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద విడుదల చేసిన మొత్తం ఎల్పీజీ కనెక్షన్లు 10,56,85,306. ఉజ్వల యోజన తాజా విస్తరణలో భాగంగా అదనంగా 25 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 2026 సెప్టెంబర్ 23 నాటికి అందులో 24,42,525 కనెక్షన్లు విడుదల చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)

