ప్రభన్యూస్

Pralhad Joshi: దేశానికి నూతన విద్యాశాఖ మంత్రి.. ఎవరీ ప్రహ్లాద్ జోషి? ఆయన ఏం చదువుకున్నారు? |


Last Updated:

నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

credit:x
credit:x

నీట్ పరీక్షల వివాదం, దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రధాన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఆయన.. తన పాత శాఖలతో పాటు విద్యాశాఖను కూడా పర్యవేక్షిస్తారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న తీవ్రమైన పరిస్థితుల్లో విద్యాశాఖను సమర్థవంతంగా నడిపించేందుకు సీనియర్ నేత అయిన జోషిని ప్రధాని ఎంపిక చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేసిన ఆందోళనల వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ రాజీనామాతో సీజేపీ తమ దీక్షను విరమించింది.

ఎవరీ ప్రహ్లాద్ జోషి.. ఆయన ఏం చదువుకున్నారు?

ప్రహ్లాద్ జోషి కర్ణాటక రాష్ట్రం, బాగల్‌కోట్ జిల్లాలోని విజయపుర (Bijapur)లో 1962 నవంబర్ 27న జన్మించారు. ఆయన తన పాఠశాల, కళాశాల విద్యాభ్యాసాన్ని కర్ణాటకలోనే పూర్తి చేశారు. ఆయన కర్ణాటక యూనివర్సిటీ (Karnataka University, Dharwad) నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A) డిగ్రీని పొందారు. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ (RSS) భావజాలంతో ప్రభావితమైన ఆయన, చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు.

ఇక కర్ణాటకలోని ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా సేవలందిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ సౌర కూటమికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు విద్యాశాఖ కూడా ఆయన పర్యవేక్షణలోకి వచ్చింది.

ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగం

విద్యావ్యవస్థలో గందరగోళం సృష్టించి, దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని వాడుకోకుండా ఉండేందుకే తాను స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు సేవ చేశానని చెప్పారు.

మే 3న జరిగిన నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని, ఆ బాధ్యత నుంచి తాను ఎప్పుడూ తప్పించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 July 2026, 10:29 pm Digital Edition : Prabhanews
Pralhad Joshi: దేశానికి నూతన విద్యాశాఖ మంత్రి.. ఎవరీ ప్రహ్లాద్ జోషి? ఆయన ఏం చదువుకున్నారు? |

Last Updated:Jul 25, 2026 10:26 PM ISTనీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.credit:xనీట్ పరీక్షల వివాదం, దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రధాన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఆయన.. తన పాత శాఖలతో పాటు విద్యాశాఖను కూడా పర్యవేక్షిస్తారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న తీవ్రమైన పరిస్థితుల్లో విద్యాశాఖను సమర్థవంతంగా నడిపించేందుకు సీనియర్ నేత అయిన జోషిని ప్రధాని ఎంపిక చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేసిన ఆందోళనల వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ రాజీనామాతో సీజేపీ తమ దీక్షను విరమించింది.ఎవరీ ప్రహ్లాద్ జోషి.. ఆయన ఏం చదువుకున్నారు?ప్రహ్లాద్ జోషి కర్ణాటక రాష్ట్రం, బాగల్‌కోట్ జిల్లాలోని విజయపుర (Bijapur)లో 1962 నవంబర్ 27న జన్మించారు. ఆయన తన పాఠశాల, కళాశాల విద్యాభ్యాసాన్ని కర్ణాటకలోనే పూర్తి చేశారు. ఆయన కర్ణాటక యూనివర్సిటీ (Karnataka University, Dharwad) నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A) డిగ్రీని పొందారు. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ (RSS) భావజాలంతో ప్రభావితమైన ఆయన, చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు.ఇక కర్ణాటకలోని ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా సేవలందిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ సౌర కూటమికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు విద్యాశాఖ కూడా ఆయన పర్యవేక్షణలోకి వచ్చింది.ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగంవిద్యావ్యవస్థలో గందరగోళం సృష్టించి, దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని వాడుకోకుండా ఉండేందుకే తాను స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు సేవ చేశానని చెప్పారు.మే 3న జరిగిన నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని, ఆ బాధ్యత నుంచి తాను ఎప్పుడూ తప్పించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,TelanganaFirst Published :Jul 25, 2026 10:24 PM ISTమరింత చదవండి

Source link