పీఎం కిసాన్ పథకం కింద అర్హత ఉన్న రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. అంటే ఏడాదిలో మొత్తం రూ.6,000 పొందుతారు. ఈ డబ్బులను ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి కాలాల్లో మూడు విడతలుగా అందిస్తారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకంగా గుర్తింపు పొందింది. పీఎం కిసాన్ విడతలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల అవుతాయి. ఈ ప్రకారం 24వ విడత డబ్బులు 2026 అక్టోబర్‌లో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక తేదీ ఇంకా వెల్లడించలేదు. ఇదిలా ఉండగా రైతులు తమ అర్హతను చెక్ చేసుకోవడం, ఈ-కేవైసీ పూర్తి చేయడం, లబ్ధిదారుల స్టేటస్ పరిశీలించడం అవసరం. ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేయని అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)

