వచ్చే రెండేళ్లలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో మరో 2 నుంచి 3 కోట్ల మంది కొత్తగా చేరే అవకాశం ఉందని పీఎఫ్ఆర్డీఏ తెలిపింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చైర్పర్సన్ ఎస్. రమణ్ గురువారం ఈ విషయం చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఎన్పీఎస్లో సుమారు 2 నుంచి 3 కోట్ల మంది కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ‘ఎన్పీఎస్ తత్కాల్’ పేరుతో పీఎఫ్ఆర్డీఏ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా యూపీఐ ఉపయోగించి కొత్తగా ఎన్పీఎస్ ఖాతా తెరవొచ్చు. మొదట ఎన్పీసీఐకి చెందిన భీమ్ యూపీఐ యాప్ ద్వారా ఈ సేవ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్.. ఇలా ఐదు బ్యాంకులు ఈ విధానంలో చేరాయి. ఎన్పీఎస్ తత్కాల్ ద్వారా ఎన్పీఎస్ సేవలను మరింత మందికి చేరువ చేయొచ్చు అని భావిస్తున్నాం. (ప్రతీకాత్మక చిత్రం)

