ప్రభన్యూస్

Nitin Nabin: తెలంగాణకి వస్తున్న బీజేపీ బాస్ నితిన్ నబీన్.. నెక్ట్స్ అధికారమే టార్గెట్.. ఛాన్స్ ఉందా? | తెలంగాణ వార్తలు


2019లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి అద్భుతం సృష్టించింది. అధికార కాంగ్రెస్ కూడా 8 సీట్లే సాధించగా.. AIMIM ఒకటి పొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 35శాతానికి పెరిగింది. సికింద్రాబాద్ (జి. కిషన్ రెడ్డి), మల్కాజ్‌గిరి (ఈటల రాజేందర్), మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ మొదలైన స్థానాలు బీజేపీకి దక్కాయి. అలాంటి బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 8 సీట్లే సాధించింది. అంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవాలని ప్రజలు కోరుకోలేదు. ప్రజల నమ్మకాన్ని పొందడంలో కమలం ఫెయిల్ అయ్యింది. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. పోనీ అప్పుడైనా.. క్యాడర్, నాయకులకు ఎక్కువ టైమ్ ఇచ్చారా అంటే అదీ లేదు. ఇక్కడికి వచ్చి.. ఏపీకి చెందిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ టైమ్ ఇచ్చారు. దాంతో మరోసారి క్యాడర్ నిరాశ పడింది. ఇలా బీజేపీ పెద్దలు చేస్తున్న చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలూ.. రాష్ట్రంలో బీజేపీలో ఉత్సాహాన్ని నీరుగార్చుతున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏం చేస్తారనేది ఆసక్తికర అంశం.

నితిన్ నబీన్ ఇవాళ మధ్యాహ్నం 3.30కి తెలంగాణకి వస్తున్నారు. మూడు రోజుల పాటు ఉండి పార్టీని బలోపేతం చేసే కీలక కార్యక్రమాలు చేపడతారు. ఇది సాధారణ పర్యటన కాదు. 2029లో తెలంగాణలో అధికారంలోకి రావాలి అనే లక్ష్యంతో చేస్తున్న పర్యటన. షెడ్యూల్ చూస్తే.. నబీన్ ఈ నెల 30 వరకూ తెలంగాణలో ఉంటారు. పార్టీని పైకి లేపేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

– బూత్ స్థాయి బలోపేతం: GHMC ప్రాంత బూత్ అధ్యక్షుల సమావేశం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తారు.

– కొత్త జిల్లా కార్యాలయాల ప్రారంభం: రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి వర్చువల్‌గా 10 కొత్త జిల్లా యూనిట్లు ప్రారంభం ఉంది.

– వివిధ వర్గాలతో సమావేశాలు: విద్యార్థులు, ఆదివాసులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది.

– సంస్థాగత సమావేశాలు: రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు, ఫ్యాక్షనల్ సమస్యల్ని పరిష్కారిస్తారు. గ్రాస్‌రూట్స్ డిసిప్లిన్ ఉండేలా చేస్తారు.

ఈ కార్యక్రమాలు బీజేపీని హైదరాబాద్-కేంద్రీకృతం నుంచి జిల్లా స్థాయికి విస్తరించడానికి ఉద్దేశించినవి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రకారం, ఇది గ్రాస్‌రూట్స్ డిసిప్లిన్, బూత్ లెవల్ ఓవర్‌హాల్‌కు భాగం.

కేంద్రం, వివిధ రాష్ట్రాల్లో తాము చేస్తున్న అభివృద్ధి పనులను చూపించడం ద్వారా.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలనేది బీజేపీ ప్లాన్. ఇందుకోసం మెరుగైన ఎక్స్‌ప్రెస్‌వేలు, ఉపాధి అవకాశాలు, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్.. వంటి వాటిని చూపిస్తోంది. మోదీ పాలన ప్రారంభమైన ఈ 12 ఏళ్లలో ఏం చేసిందీ చెబుతోంది. ఇప్పటికే తెలంగాణలో కాస్త పట్టున్న ఉత్తర తెలంగాణ, హైదరాబాద్‌పై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు నితిన్ నబీన్ పార్టీలో లోపాల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు.

1. గ్రాస్‌రూట్స్ స్ట్రెంగ్తెనింగ్: బూత్ లెవల్ కార్యకర్తలు బలపడేలా చేస్తారు. వారానికి ఒక “యూనిటీ ట్రాకర్” రివ్యూ నిర్వహిస్తారు. నేతలు కార్యకర్తలతో ఉండేలా చేస్తారు.

2. ఫ్యాక్షనల్ ఐష్యూస్: హైదరాబాద్ నుంచి నేతలు జిల్లాల్లోకి వెళ్లేలా చేస్తారు. వెళ్లని వారికి పదవులు పోతాయని ఇప్పటికే హెచ్చరించారు.

3. విస్తరణ: దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లేలా నబీన్ ఫోకస్ ఉంటుంది. పార్టీ తరపున కొత్త జిల్లా యూనిట్లు ప్రారంభిస్తున్నారు.

4. ప్రజా సమస్యలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలు నెరవేర్చడం, ఇన్‌ఫ్రా, ఉపాధి అవకాశాలపై ఫోకస్ పెడతారు.

బీజేపీ ఎలా ఉన్నా.. స్థానికంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా బలంగా ఉన్నాయి. నెక్ట్స్ ఎన్నికల్లో ఏ పార్టీలతోనూ పొత్తు ఉండదని ఇటీవల హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. తెలంగాణలో పొత్తు లేకపోతే.. నెక్ట్స్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీకి తోడుగా.. కవిత పార్టీ, జనసేన పార్టీ రంగంలోకి దిగుతున్నాయి. అందువల్ల ప్రతిపక్ష ఓటు బాగా చీలిపోతుంది. ఇది కాంగ్రెస్‌కి ప్లస్ అవ్వగలదు. అందువల్ల ఏపీ తరహాలో పొత్తు ఉండటమే మేలనే విశ్లేషణలు ఉన్నాయి. కానీ బీజేపీ హైకమాండ్.. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా.. ఒంటరిగా పార్టీని డెవలప్ చెయ్యాలనే ప్లాన్‌లో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇలాగే చేస్తోంది. బెంగాల్‌లో ఈ ఒంటరిపోరే.. భారీ విజయాన్ని ఇచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 1:34 am Digital Edition : Prabhanews
Nitin Nabin: తెలంగాణకి వస్తున్న బీజేపీ బాస్ నితిన్ నబీన్.. నెక్ట్స్ అధికారమే టార్గెట్.. ఛాన్స్ ఉందా? | తెలంగాణ వార్తలు

2019లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి అద్భుతం సృష్టించింది. అధికార కాంగ్రెస్ కూడా 8 సీట్లే సాధించగా.. AIMIM ఒకటి పొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 35శాతానికి పెరిగింది. సికింద్రాబాద్ (జి. కిషన్ రెడ్డి), మల్కాజ్‌గిరి (ఈటల రాజేందర్), మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ మొదలైన స్థానాలు బీజేపీకి దక్కాయి. అలాంటి బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 8 సీట్లే సాధించింది. అంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవాలని ప్రజలు కోరుకోలేదు. ప్రజల నమ్మకాన్ని పొందడంలో కమలం ఫెయిల్ అయ్యింది. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. పోనీ అప్పుడైనా.. క్యాడర్, నాయకులకు ఎక్కువ టైమ్ ఇచ్చారా అంటే అదీ లేదు. ఇక్కడికి వచ్చి.. ఏపీకి చెందిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ టైమ్ ఇచ్చారు. దాంతో మరోసారి క్యాడర్ నిరాశ పడింది. ఇలా బీజేపీ పెద్దలు చేస్తున్న చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలూ.. రాష్ట్రంలో బీజేపీలో ఉత్సాహాన్ని నీరుగార్చుతున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏం చేస్తారనేది ఆసక్తికర అంశం.నితిన్ నబీన్ ఇవాళ మధ్యాహ్నం 3.30కి తెలంగాణకి వస్తున్నారు. మూడు రోజుల పాటు ఉండి పార్టీని బలోపేతం చేసే కీలక కార్యక్రమాలు చేపడతారు. ఇది సాధారణ పర్యటన కాదు. 2029లో తెలంగాణలో అధికారంలోకి రావాలి అనే లక్ష్యంతో చేస్తున్న పర్యటన. షెడ్యూల్ చూస్తే.. నబీన్ ఈ నెల 30 వరకూ తెలంగాణలో ఉంటారు. పార్టీని పైకి లేపేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.- బూత్ స్థాయి బలోపేతం: GHMC ప్రాంత బూత్ అధ్యక్షుల సమావేశం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తారు.- కొత్త జిల్లా కార్యాలయాల ప్రారంభం: రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి వర్చువల్‌గా 10 కొత్త జిల్లా యూనిట్లు ప్రారంభం ఉంది.- వివిధ వర్గాలతో సమావేశాలు: విద్యార్థులు, ఆదివాసులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది.- సంస్థాగత సమావేశాలు: రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు, ఫ్యాక్షనల్ సమస్యల్ని పరిష్కారిస్తారు. గ్రాస్‌రూట్స్ డిసిప్లిన్ ఉండేలా చేస్తారు.ఈ కార్యక్రమాలు బీజేపీని హైదరాబాద్-కేంద్రీకృతం నుంచి జిల్లా స్థాయికి విస్తరించడానికి ఉద్దేశించినవి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రకారం, ఇది గ్రాస్‌రూట్స్ డిసిప్లిన్, బూత్ లెవల్ ఓవర్‌హాల్‌కు భాగం.కేంద్రం, వివిధ రాష్ట్రాల్లో తాము చేస్తున్న అభివృద్ధి పనులను చూపించడం ద్వారా.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలనేది బీజేపీ ప్లాన్. ఇందుకోసం మెరుగైన ఎక్స్‌ప్రెస్‌వేలు, ఉపాధి అవకాశాలు, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్.. వంటి వాటిని చూపిస్తోంది. మోదీ పాలన ప్రారంభమైన ఈ 12 ఏళ్లలో ఏం చేసిందీ చెబుతోంది. ఇప్పటికే తెలంగాణలో కాస్త పట్టున్న ఉత్తర తెలంగాణ, హైదరాబాద్‌పై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు నితిన్ నబీన్ పార్టీలో లోపాల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు.1. గ్రాస్‌రూట్స్ స్ట్రెంగ్తెనింగ్: బూత్ లెవల్ కార్యకర్తలు బలపడేలా చేస్తారు. వారానికి ఒక "యూనిటీ ట్రాకర్" రివ్యూ నిర్వహిస్తారు. నేతలు కార్యకర్తలతో ఉండేలా చేస్తారు.2. ఫ్యాక్షనల్ ఐష్యూస్: హైదరాబాద్ నుంచి నేతలు జిల్లాల్లోకి వెళ్లేలా చేస్తారు. వెళ్లని వారికి పదవులు పోతాయని ఇప్పటికే హెచ్చరించారు.3. విస్తరణ: దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లేలా నబీన్ ఫోకస్ ఉంటుంది. పార్టీ తరపున కొత్త జిల్లా యూనిట్లు ప్రారంభిస్తున్నారు.4. ప్రజా సమస్యలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలు నెరవేర్చడం, ఇన్‌ఫ్రా, ఉపాధి అవకాశాలపై ఫోకస్ పెడతారు.బీజేపీ ఎలా ఉన్నా.. స్థానికంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా బలంగా ఉన్నాయి. నెక్ట్స్ ఎన్నికల్లో ఏ పార్టీలతోనూ పొత్తు ఉండదని ఇటీవల హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. తెలంగాణలో పొత్తు లేకపోతే.. నెక్ట్స్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీకి తోడుగా.. కవిత పార్టీ, జనసేన పార్టీ రంగంలోకి దిగుతున్నాయి. అందువల్ల ప్రతిపక్ష ఓటు బాగా చీలిపోతుంది. ఇది కాంగ్రెస్‌కి ప్లస్ అవ్వగలదు. అందువల్ల ఏపీ తరహాలో పొత్తు ఉండటమే మేలనే విశ్లేషణలు ఉన్నాయి. కానీ బీజేపీ హైకమాండ్.. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా.. ఒంటరిగా పార్టీని డెవలప్ చెయ్యాలనే ప్లాన్‌లో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇలాగే చేస్తోంది. బెంగాల్‌లో ఈ ఒంటరిపోరే.. భారీ విజయాన్ని ఇచ్చింది.

Source link