ప్రభన్యూస్

Night Leg Cramps: రాత్రిపూట కాళ్లలో తీవ్రమైన నొప్పితో మేల్కొంటున్నారా?.. అసలు కారణం ఇదే జాగ్రత్త! | లైఫ్ స్టైల్


Last Updated:

రాత్రిపూట కాళ్ల కండరాల పట్టేయడం లేదా నైట్‌టైమ్ లెగ్ క్రాంప్స్ అంటారు. సాధారణంగా ఈ నొప్పి కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు. క్రాంప్ తగ్గిపోయిన తర్వాత కూడా కండరంలో కొంతసేపు నొప్పి లేదా బిగుతుగా ఉన్న భావన ఉండవచ్చు.

News18
News18

రాత్రిపూట హాయిగా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా కాలి కండరం బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పి రావడం చాలామందికి ఎదురయ్యే సమస్య. ముఖ్యంగా పిక్క కండరాల్లో అకస్మాత్తుగా పట్టేయడం వల్ల నిద్ర నుంచి మేల్కొనాల్సి వస్తుంది. దీనినే రాత్రిపూట కాళ్ల కండరాల పట్టేయడం లేదా నైట్‌టైమ్ లెగ్ క్రాంప్స్ అంటారు. సాధారణంగా ఈ నొప్పి కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు. క్రాంప్ తగ్గిపోయిన తర్వాత కూడా కండరంలో కొంతసేపు నొప్పి లేదా బిగుతుగా ఉన్న భావన ఉండవచ్చు.

రాత్రిపూట కాళ్లు పట్టేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు. రోజంతా ఎక్కువగా నడవడం, ఎక్కువసేపు నిలబడటం, మెట్లు ఎక్కువగా ఎక్కడం లేదా శారీరక శ్రమ చేయడం వల్ల కాళ్ల కండరాలు అలసిపోతాయి. అలాగే రోజంతా ఎక్కువసేపు కూర్చోవడం, కాళ్లను ఎక్కువగా కదపకుండా ఒకే భంగిమలో ఉండటం వల్ల కూడా కండరాలపై ప్రభావం పడొచ్చు. నిద్రలో కాలు ఒకే స్థితిలో ఎక్కువసేపు ఉండటం కూడా కొంతమందిలో క్రాంప్స్‌కు కారణం కావచ్చు.

శరీరంలో నీరు తగ్గడం కూడా కండరాల తిమ్మిరికి ఒక కారణం కావచ్చు. రోజంతా తగినంత నీరు తీసుకోకపోవడం, ఎక్కువగా చెమట పట్టడం లేదా తీవ్రమైన వ్యాయామం చేయడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడవచ్చు. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు కండరాల సాధారణ పనితీరుకు అవసరం. అయితే కాళ్లు పట్టడానికి ప్రతిసారీ వీటి లోపమే కారణమని భావించడం సరైంది కాదు. వయసు పెరగడం, గర్భధారణ సమయంలో శరీరంలో వచ్చే మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని మందుల ప్రభావం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.

కాలు ఒక్కసారిగా పట్టుకున్నప్పుడు ముందుగా కండరాన్ని మెల్లగా స్ట్రెచ్ చేయాలి. పిక్క కండరం పట్టుకుంటే కాలును నిటారుగా ఉంచి పాదం వేళ్లను మెల్లగా మన వైపు లాగడం కొంత ఉపశమనం ఇవ్వవచ్చు. వీలైతే కొద్దిసేపు నెమ్మదిగా నడవడం, కండరాన్ని సున్నితంగా మసాజ్ చేయడం కూడా సహాయపడొచ్చు. కొంతమందికి వెచ్చని నీటితో స్నానం చేయడం లేదా వేడి నీటి బ్యాగ్‌ను కొద్దిసేపు ఉపయోగించడం వల్ల కండరాల బిగుతు తగ్గవచ్చు. అయితే బలంగా మసాజ్ చేయడం లేదా ఒక్కసారిగా కాలును గట్టిగా లాగడం చేయకూడదు.

రాత్రిపూట కాళ్లు తరచుగా పట్టకుండా ఉండేందుకు పడుకునే ముందు కొన్ని నిమిషాలు కాళ్లు, పిక్క కండరాలను మెల్లగా స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోవచ్చు. రోజంతా తగినంత నీరు తాగడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా మధ్య మధ్యలో లేచి నడవడం, శారీరక శ్రమ ఎక్కువగా చేసిన రోజుల్లో కండరాలకు తగిన విశ్రాంతి ఇవ్వడం ఉపయోగపడవచ్చు. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, గింజలు వంటి పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. కాళ్లు పట్టుతున్నాయని చెప్పి మెగ్నీషియం లేదా పొటాషియం సప్లిమెంట్లను స్వయంగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు.

అప్పుడప్పుడు మాత్రమే కాలు పట్టడం సాధారణంగా పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ దాదాపు ప్రతిరోజూ క్రాంప్స్ రావడం, నొప్పి చాలా తీవ్రంగా ఉండటం, నొప్పి ఎక్కువసేపు కొనసాగడం, కాళ్లలో వాపు, తిమ్మిరి లేదా బలహీనత కనిపించడం, నడిచేటప్పుడు పదేపదే నొప్పి రావడం వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఒక కాలు అకస్మాత్తుగా వాపు, తీవ్రమైన నొప్పి, ఎర్రగా లేదా వేడిగా మారడంతో పాటు ఛాతి నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. కాబట్టి రాత్రిపూట కాళ్లు పట్టే సమస్య తరచూ వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అసలు కారణాన్ని గుర్తించడం ముఖ్యం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 1:25 pm Digital Edition : Prabhanews
Night Leg Cramps: రాత్రిపూట కాళ్లలో తీవ్రమైన నొప్పితో మేల్కొంటున్నారా?.. అసలు కారణం ఇదే జాగ్రత్త! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 29, 2026 1:22 PM ISTరాత్రిపూట కాళ్ల కండరాల పట్టేయడం లేదా నైట్‌టైమ్ లెగ్ క్రాంప్స్ అంటారు. సాధారణంగా ఈ నొప్పి కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు. క్రాంప్ తగ్గిపోయిన తర్వాత కూడా కండరంలో కొంతసేపు నొప్పి లేదా బిగుతుగా ఉన్న భావన ఉండవచ్చు.News18రాత్రిపూట హాయిగా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా కాలి కండరం బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పి రావడం చాలామందికి ఎదురయ్యే సమస్య. ముఖ్యంగా పిక్క కండరాల్లో అకస్మాత్తుగా పట్టేయడం వల్ల నిద్ర నుంచి మేల్కొనాల్సి వస్తుంది. దీనినే రాత్రిపూట కాళ్ల కండరాల పట్టేయడం లేదా నైట్‌టైమ్ లెగ్ క్రాంప్స్ అంటారు. సాధారణంగా ఈ నొప్పి కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు. క్రాంప్ తగ్గిపోయిన తర్వాత కూడా కండరంలో కొంతసేపు నొప్పి లేదా బిగుతుగా ఉన్న భావన ఉండవచ్చు.రాత్రిపూట కాళ్లు పట్టేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు. రోజంతా ఎక్కువగా నడవడం, ఎక్కువసేపు నిలబడటం, మెట్లు ఎక్కువగా ఎక్కడం లేదా శారీరక శ్రమ చేయడం వల్ల కాళ్ల కండరాలు అలసిపోతాయి. అలాగే రోజంతా ఎక్కువసేపు కూర్చోవడం, కాళ్లను ఎక్కువగా కదపకుండా ఒకే భంగిమలో ఉండటం వల్ల కూడా కండరాలపై ప్రభావం పడొచ్చు. నిద్రలో కాలు ఒకే స్థితిలో ఎక్కువసేపు ఉండటం కూడా కొంతమందిలో క్రాంప్స్‌కు కారణం కావచ్చు.శరీరంలో నీరు తగ్గడం కూడా కండరాల తిమ్మిరికి ఒక కారణం కావచ్చు. రోజంతా తగినంత నీరు తీసుకోకపోవడం, ఎక్కువగా చెమట పట్టడం లేదా తీవ్రమైన వ్యాయామం చేయడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడవచ్చు. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు కండరాల సాధారణ పనితీరుకు అవసరం. అయితే కాళ్లు పట్టడానికి ప్రతిసారీ వీటి లోపమే కారణమని భావించడం సరైంది కాదు. వయసు పెరగడం, గర్భధారణ సమయంలో శరీరంలో వచ్చే మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని మందుల ప్రభావం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.కాలు ఒక్కసారిగా పట్టుకున్నప్పుడు ముందుగా కండరాన్ని మెల్లగా స్ట్రెచ్ చేయాలి. పిక్క కండరం పట్టుకుంటే కాలును నిటారుగా ఉంచి పాదం వేళ్లను మెల్లగా మన వైపు లాగడం కొంత ఉపశమనం ఇవ్వవచ్చు. వీలైతే కొద్దిసేపు నెమ్మదిగా నడవడం, కండరాన్ని సున్నితంగా మసాజ్ చేయడం కూడా సహాయపడొచ్చు. కొంతమందికి వెచ్చని నీటితో స్నానం చేయడం లేదా వేడి నీటి బ్యాగ్‌ను కొద్దిసేపు ఉపయోగించడం వల్ల కండరాల బిగుతు తగ్గవచ్చు. అయితే బలంగా మసాజ్ చేయడం లేదా ఒక్కసారిగా కాలును గట్టిగా లాగడం చేయకూడదు.రాత్రిపూట కాళ్లు తరచుగా పట్టకుండా ఉండేందుకు పడుకునే ముందు కొన్ని నిమిషాలు కాళ్లు, పిక్క కండరాలను మెల్లగా స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోవచ్చు. రోజంతా తగినంత నీరు తాగడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా మధ్య మధ్యలో లేచి నడవడం, శారీరక శ్రమ ఎక్కువగా చేసిన రోజుల్లో కండరాలకు తగిన విశ్రాంతి ఇవ్వడం ఉపయోగపడవచ్చు. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, గింజలు వంటి పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. కాళ్లు పట్టుతున్నాయని చెప్పి మెగ్నీషియం లేదా పొటాషియం సప్లిమెంట్లను స్వయంగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు.అప్పుడప్పుడు మాత్రమే కాలు పట్టడం సాధారణంగా పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ దాదాపు ప్రతిరోజూ క్రాంప్స్ రావడం, నొప్పి చాలా తీవ్రంగా ఉండటం, నొప్పి ఎక్కువసేపు కొనసాగడం, కాళ్లలో వాపు, తిమ్మిరి లేదా బలహీనత కనిపించడం, నడిచేటప్పుడు పదేపదే నొప్పి రావడం వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఒక కాలు అకస్మాత్తుగా వాపు, తీవ్రమైన నొప్పి, ఎర్రగా లేదా వేడిగా మారడంతో పాటు ఛాతి నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. కాబట్టి రాత్రిపూట కాళ్లు పట్టే సమస్య తరచూ వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అసలు కారణాన్ని గుర్తించడం ముఖ్యం.మరింత చదవండి

Source link