CNG కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి మారుతి సుజుకి ఇండియా కీలకమైన కొత్త ఆప్షన్లను తీసుకొచ్చింది. ఇప్పటివరకు CNG కార్లలో ఎక్కువగా మాన్యువల్ గేర్‌బాక్స్‌నే అందించిన కంపెనీ.. ఇప్పుడు తొలిసారిగా ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNG మోడళ్లలో ఆటోమేటిక్ గేర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా Swift, Dzire, Baleno CNG మోడళ్లను AMT గేర్‌బాక్స్‌తో విడుదల చేసింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మూడు మోడళ్లకు ప్రత్యేక ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరలను కంపెనీ ప్రకటించింది. Swift CNG AMT ధర రూ.7.92 లక్షల నుంచి, Baleno CNG AMT ధర రూ.8.32 లక్షల నుంచి, Dzire CNG AMT ధర రూ.8.53 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇవి పండుగ సీజన్ కోసం ప్రకటించిన ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరలు. నగరం, వేరియంట్, పన్నులు, ఇన్సూరెన్స్ వంటి అంశాలను బట్టి ఆన్‌రోడ్ ధర మారవచ్చు.

