ఈ పాలసీ తీసుకోవాలనుకునే వారు కొన్ని వయసు, పెట్టుబడి నిబంధనలు పాటించాలి. కనీస పాలసీ కొనుగోలు ధర రూ.1,50,000. అయితే ఎంచుకున్న యాన్యుటీ చెల్లింపు విధానానికి సంబంధించిన కనీస యాన్యుటీ నిబంధనలను కూడా పాటించాలి. గరిష్ఠ కొనుగోలు ధరకు ప్రత్యేక పరిమితి లేదు. అయితే ఒక్కో వ్యక్తికి అనుమతించే గరిష్ఠ యాన్యుటీ మొత్తం ఎల్‌ఐసీ బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీ ప్రకారం నిర్ణయిస్తారు. వయసు పరిమితుల విషయానికి వస్తే, కనీస ప్రవేశ వయసు 30 సంవత్సరాలు, గరిష్ఠ ప్రవేశ వయసు 79 సంవత్సరాలు. కనీస వెస్టింగ్ వయసు అంటే పాలసీ బెనిఫిట్ పొందే వయస్సు 31 సంవత్సరాలు కాగా, గరిష్ఠ వెస్టింగ్ వయసు 80 సంవత్సరాలు. డిఫర్‌మెంట్ పీరియడ్ కనీసం ఒక సంవత్సరం, గరిష్ఠంగా ఐదేళ్లు ఉంటుంది. అయితే గరిష్ఠ వెస్టింగ్ వయసు నిబంధనకు లోబడి ఉంటుంది. కనీస యాన్యుటీ మొత్తం విషయానికి వస్తే, నెలవారీ చెల్లింపులకు కనీసం రూ.1,000, మూడు నెలలకు ఒకసారి చెల్లింపులకు రూ.3,000, ఆరు నెలలకు ఒకసారి చెల్లింపులకు రూ.6,000, ఏడాదికి ఒకసారి చెల్లింపులకు రూ.12,000 ఉండాలి. ఎంచుకున్న చెల్లింపు విధానానికి అవసరమైన కనీస యాన్యుటీ మొత్తం రాకపోతే, పాలసీ కొనుగోలు ధరను పెంచాల్సి రావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

