Last Updated:
ఉదయం ఆఫీస్‌కు వెళ్లాలంటేనే బద్ధకంగా అనిపించడం, పని చేయాలనే ఉత్సాహం తగ్గిపోవడం, కేవలం జీతం కోసం ఉద్యోగం చేస్తున్నామనే భావన కలగడం వంటివి కొందరిలో కనిపిస్తాయి. దీనికి పని ఒత్తిడి, సహోద్యోగులతో సమస్యలు, గుర్తింపు లేకపోవడం లేదా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు.
చాలామంది కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా పనిచేస్తుంటారు. కొత్త వ్యక్తులు, కొత్త బాధ్యతలు, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. అయితే రోజులు, నెలలు గడిచే కొద్దీ అదే పని రొటీన్‌గా అనిపించడం ప్రారంభమవుతుంది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లాలంటేనే బద్ధకంగా అనిపించడం, పని చేయాలనే ఉత్సాహం తగ్గిపోవడం, కేవలం జీతం కోసం ఉద్యోగం చేస్తున్నామనే భావన కలగడం వంటివి కొందరిలో కనిపిస్తాయి. దీనికి పని ఒత్తిడి, సహోద్యోగులతో సమస్యలు, గుర్తింపు లేకపోవడం లేదా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని విషయాలపై దృష్టి పెట్టడం ఉపయోగకరంగా ఉంటుందని సైకాలజిస్ట్ హరీష్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.

