ప్రభన్యూస్

Iran vs USA: పశ్చిమాసియాలో మరోసారి భగ్గుమన్న ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు |


Last Updated:

Iran vs USA: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఓవైపు అణు ఒప్పందంపై శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలోనే, అమెరికా సైన్యం ఇరాన్‌పై ‘పరిమిత దాడుల’కు దిగింది.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఖార్గ్ ద్వీపంలోని సుజా ప్రాంతంలో రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సైనిక చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో స్పందిస్తూ.. ఇది అత్యంత చిన్నపాటి చర్య అని, కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తయిందని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్‌పై పూర్తిస్థాయి దాడులు పునరుద్ధరించేందుకు యూఎస్ సెంట్రల్ కమాండ్ భారీ ప్రణాళికలతో సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. పశ్చిమాసియాలో అమావాస్య చీకట్లను ఆసరాగా చేసుకుని వ్యూహాత్మకంగా రాత్రివేళ సైనిక దాడులు చేపట్టేందుకు బలగాలు సన్నద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, తమ బాలిస్టిక్ క్షిపణుల పరిధిపై ఉన్న 2,000 కిలోమీటర్ల స్వయం నియంత్రణను ఎత్తివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.

ట్రంప్ హెచ్చరికలు – ఇరాక్ అభ్యంతరం

ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందిస్తూ.. అణ్వాయుధాన్ని సాధించకుండా తాను ఇరాన్‌ను అడ్డుకోకపోయి ఉంటే ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా ప్రాంతమే ప్రపంచ పటంలో ఉండేది కాదని పేర్కొన్నారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్ ప్రధాని అలీ ఫతేహ్ అల్-జైదీ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పొరుగు దేశాలపై దాడులు చేయడానికి తమ భూభాగాన్ని, గగనతలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా వినియోగించరాదని, స్వతంత్ర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ఆయన గట్టిగా తేల్చిచెప్పారు.

అణు సమాచారానికి భారీ నజరానా

ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు అమెరికా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇరాన్‌లోని అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలు, రహస్య సామగ్రికి సంబంధించిన వివరాలు అందించిన వారికి ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ ప్రోగ్రామ్ కింద ఏకంగా 2 కోట్ల డాలర్లు (సుమారు ₹180 కోట్లకు పైగా) నజరానాతో పాటు రక్షణ, పునరావాసం కల్పిస్తామని అమెరికా సైన్యం ప్రకటించింది.

హూతీల ప్రతీకార దాడులు – యెమెన్‌లో విషాదం

యెమెన్ రాజధాని సనా సమీపంలో శనివారం జరిగిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులతో సహా 27 మంది మరణించగా, దక్షిణ యెమెన్‌లో జరిగిన మరో దాడిలో 90 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా హూతీ తిరుగుబాటుదారులు రియాద్ ఎయిర్‌పోర్ట్, అరాంకో చమురు శుద్ధి కేంద్రాలు, సౌదీ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించడంతో పశ్చిమాసియాలో పరిస్థితి అగ్నిగుండంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 8:25 am Digital Edition : Prabhanews
Iran vs USA: పశ్చిమాసియాలో మరోసారి భగ్గుమన్న ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు |

Last Updated:Nov 08, 2026 8:21 AM ISTIran vs USA: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఓవైపు అణు ఒప్పందంపై శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలోనే, అమెరికా సైన్యం ఇరాన్‌పై ‘పరిమిత దాడుల’కు దిగింది.ఫైల్ ఫోటోఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఖార్గ్ ద్వీపంలోని సుజా ప్రాంతంలో రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సైనిక చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో స్పందిస్తూ.. ఇది అత్యంత చిన్నపాటి చర్య అని, కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తయిందని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్‌పై పూర్తిస్థాయి దాడులు పునరుద్ధరించేందుకు యూఎస్ సెంట్రల్ కమాండ్ భారీ ప్రణాళికలతో సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. పశ్చిమాసియాలో అమావాస్య చీకట్లను ఆసరాగా చేసుకుని వ్యూహాత్మకంగా రాత్రివేళ సైనిక దాడులు చేపట్టేందుకు బలగాలు సన్నద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, తమ బాలిస్టిక్ క్షిపణుల పరిధిపై ఉన్న 2,000 కిలోమీటర్ల స్వయం నియంత్రణను ఎత్తివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.ట్రంప్ హెచ్చరికలు - ఇరాక్ అభ్యంతరంట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందిస్తూ.. అణ్వాయుధాన్ని సాధించకుండా తాను ఇరాన్‌ను అడ్డుకోకపోయి ఉంటే ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా ప్రాంతమే ప్రపంచ పటంలో ఉండేది కాదని పేర్కొన్నారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్ ప్రధాని అలీ ఫతేహ్ అల్-జైదీ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పొరుగు దేశాలపై దాడులు చేయడానికి తమ భూభాగాన్ని, గగనతలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా వినియోగించరాదని, స్వతంత్ర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ఆయన గట్టిగా తేల్చిచెప్పారు.అణు సమాచారానికి భారీ నజరానాఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు అమెరికా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇరాన్‌లోని అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలు, రహస్య సామగ్రికి సంబంధించిన వివరాలు అందించిన వారికి ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ ప్రోగ్రామ్ కింద ఏకంగా 2 కోట్ల డాలర్లు (సుమారు ₹180 కోట్లకు పైగా) నజరానాతో పాటు రక్షణ, పునరావాసం కల్పిస్తామని అమెరికా సైన్యం ప్రకటించింది.హూతీల ప్రతీకార దాడులు - యెమెన్‌లో విషాదంయెమెన్ రాజధాని సనా సమీపంలో శనివారం జరిగిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులతో సహా 27 మంది మరణించగా, దక్షిణ యెమెన్‌లో జరిగిన మరో దాడిలో 90 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా హూతీ తిరుగుబాటుదారులు రియాద్ ఎయిర్‌పోర్ట్, అరాంకో చమురు శుద్ధి కేంద్రాలు, సౌదీ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించడంతో పశ్చిమాసియాలో పరిస్థితి అగ్నిగుండంగా మారింది.మరింత చదవండి

Source link