ప్రభన్యూస్

Katrina Kaif: తొలిసారి కొడుకు ఫోటో చూపిస్తూ కత్రినా కైఫ్ దీపావళి సర్‌ప్రైజ్.. బుడ్డోడు, ఎంత ముద్దుగున్నాడో..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్ లవ్లీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ అభిమానులకు ఈ దీపావళి పండుగ సందర్భంగా సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. తమ ముద్దుల కుమారుడు ‘విహాన్‌’ (Vihaan) తొలి ఫోటోను మొట్టమొదటిసారి వదిలారు.

News18
News18

బాలీవుడ్ లవ్లీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ అభిమానులకు ఈ దీపావళి పండుగ సందర్భంగా సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. తమ ముద్దుల కుమారుడు ‘విహాన్‌’ (Vihaan) తొలి ఫోటోను మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. నవంబర్ 07న విహాన్ మొదటి పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్న ఈ జంట, ఆ మరుసటి రోజే దీపావళి కానుకగా ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటోను పంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

వైరల్ అవుతున్న ఈ క్యూట్ ఫొటోలో విక్కీ, కత్రినా, విహాన్ ముగ్గురూ ఆకర్షణీయమైన సాంప్రదాయ దుస్తుల్లో అట్రాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నెటిజన్ల దృష్టి అంతా చిన్నారి విహాన్ పైనే పడింది. క్రీమ్ కలర్ కుర్తా-పైజామా, దానికి నప్పే పసుపు రంగు నెహ్రూ జాకెట్ ధరించిన విహాన్.. తల్లిదండ్రుల మధ్య నిలబడి కెమెరా వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న తీరు బాగా ఆకట్టుకుంటోంది. ఇక పసుపు రంగు ఎంబ్రాయిడరీ దుస్తులలో కత్రినా కైఫ్ మెరిసిపోతుండగా.. నేలపై కూర్చుని కొడుకును ఎంతో ప్రేమగా పట్టుకుంది. విక్కీ కౌశల్ క్రీమ్ కలర్ కుర్తాలో కుమారుడి పక్కనే కూర్చుని మురిసిపోతూ కనిపించాడు.

ఈ క్యూట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కత్రినా కైఫ్.. “ఇప్పటివరకు నేను జరుపుకున్న దీపావళి వేడుకల్లో కెల్లా ఇదే అత్యంత ప్రకాశవంతమైనది. ప్రతి ఒక్కరూ ప్రేమ, వెలుగు, ఆనందంతో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్‌పై అభిమానులతో పాటు కరీనా కపూర్, సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ విహాన్‌కు, ఈ క్యూట్ ఫ్యామిలీకి ఆశీస్సులు అందజేశారు.

కొడుకు పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ:

2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కత్రినా, విక్కీ అత్యంత వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవంబర్ 7, 2025న కత్రినా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2026 జనవరిలో చిన్నారి చేతిని పట్టుకున్న ఫోటోను పంచుకున్న విక్కీ.. తన కొడుకుకు ‘విహాన్ కౌశల్’ అని పేరు పెట్టినట్లు ప్రకటించాడు. అయితే ఈ పేరు వెనుక ఒక సెంటిమెంట్ దాగుంది. 2019లో విక్కీ కెరీర్‌ను మలుపు తిప్పి, అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టిన సెన్సేషనల్ హిట్ చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’. ఆ సినిమాలో విక్కీ పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్ర పేరు ‘మేజర్ విహాన్ సింగ్ షేర్‌గిల్’. తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఆ పాత్ర పేరునే విక్కీ తన కొడుకుకు పెట్టుకోవడం అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 10:50 am Digital Edition : Prabhanews
Katrina Kaif: తొలిసారి కొడుకు ఫోటో చూపిస్తూ కత్రినా కైఫ్ దీపావళి సర్‌ప్రైజ్.. బుడ్డోడు, ఎంత ముద్దుగున్నాడో..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 09, 2026 10:12 AM ISTబాలీవుడ్ లవ్లీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ అభిమానులకు ఈ దీపావళి పండుగ సందర్భంగా సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. తమ ముద్దుల కుమారుడు 'విహాన్‌' (Vihaan) తొలి ఫోటోను మొట్టమొదటిసారి వదిలారు. News18బాలీవుడ్ లవ్లీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ అభిమానులకు ఈ దీపావళి పండుగ సందర్భంగా సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. తమ ముద్దుల కుమారుడు 'విహాన్‌' (Vihaan) తొలి ఫోటోను మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. నవంబర్ 07న విహాన్ మొదటి పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్న ఈ జంట, ఆ మరుసటి రోజే దీపావళి కానుకగా ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటోను పంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.వైరల్ అవుతున్న ఈ క్యూట్ ఫొటోలో విక్కీ, కత్రినా, విహాన్ ముగ్గురూ ఆకర్షణీయమైన సాంప్రదాయ దుస్తుల్లో అట్రాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నెటిజన్ల దృష్టి అంతా చిన్నారి విహాన్ పైనే పడింది. క్రీమ్ కలర్ కుర్తా-పైజామా, దానికి నప్పే పసుపు రంగు నెహ్రూ జాకెట్ ధరించిన విహాన్.. తల్లిదండ్రుల మధ్య నిలబడి కెమెరా వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న తీరు బాగా ఆకట్టుకుంటోంది. ఇక పసుపు రంగు ఎంబ్రాయిడరీ దుస్తులలో కత్రినా కైఫ్ మెరిసిపోతుండగా.. నేలపై కూర్చుని కొడుకును ఎంతో ప్రేమగా పట్టుకుంది. విక్కీ కౌశల్ క్రీమ్ కలర్ కుర్తాలో కుమారుడి పక్కనే కూర్చుని మురిసిపోతూ కనిపించాడు.ఈ క్యూట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కత్రినా కైఫ్.. "ఇప్పటివరకు నేను జరుపుకున్న దీపావళి వేడుకల్లో కెల్లా ఇదే అత్యంత ప్రకాశవంతమైనది. ప్రతి ఒక్కరూ ప్రేమ, వెలుగు, ఆనందంతో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను" అంటూ ఎమోషనల్ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్‌పై అభిమానులతో పాటు కరీనా కపూర్, సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ విహాన్‌కు, ఈ క్యూట్ ఫ్యామిలీకి ఆశీస్సులు అందజేశారు.కొడుకు పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ:2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కత్రినా, విక్కీ అత్యంత వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవంబర్ 7, 2025న కత్రినా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2026 జనవరిలో చిన్నారి చేతిని పట్టుకున్న ఫోటోను పంచుకున్న విక్కీ.. తన కొడుకుకు 'విహాన్ కౌశల్' అని పేరు పెట్టినట్లు ప్రకటించాడు. అయితే ఈ పేరు వెనుక ఒక సెంటిమెంట్ దాగుంది. 2019లో విక్కీ కెరీర్‌ను మలుపు తిప్పి, అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టిన సెన్సేషనల్ హిట్ చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’. ఆ సినిమాలో విక్కీ పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్ర పేరు 'మేజర్ విహాన్ సింగ్ షేర్‌గిల్'. తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఆ పాత్ర పేరునే విక్కీ తన కొడుకుకు పెట్టుకోవడం అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది.మరింత చదవండి

Source link