డ్రాగన్ ఫ్రూట్.. ఆకర్షణీయమైన రంగు, స్వల్ప తీపి రుచి, పోషక విలువల కారణంగా ఇటీవలి కాలంలో చాలామందికి ఇష్టమైన పండుగా మారింది. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉండటంతో ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్యకరమైన పండు అయినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా సరిపోతుందని చెప్పలేం. కొందరికి దీన్ని తిన్న తర్వాత అలర్జీ, జీర్ణ సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, క్రమం తప్పకుండా మందులు వాడేవారు ఆహారంలో దీన్ని చేర్చుకునే ముందు వైద్యుడు లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.

