ప్రభన్యూస్

GST New Rule: మరో 3 రోజుల్లో జీఎస్టీలో భారీ మార్పులు… బిజినెస్ చేసే వారు తప్పక తెలుసుకోండి | New GST Rules From August 1 | బిజినెస్


Last Updated:

ఆగస్టు 1 నుండి కొత్త జీఎస్టీ నిబంధనలు అమలులోకి రానున్నాయి. బిల్ టు-షిప్ టు లావాదేవీలకు షిప్ టు జీఎస్టీఐఎన్ తప్పనిసరి. ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ వ్యవస్థల్లో కొత్త వెరిఫికేషన్ ఉంటుంది.

GST New Rule: మరో 3 రోజుల్లో జీఎస్టీలో భారీ మార్పులు... బిజినెస్ చేసే వారు తప్పక తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
GST New Rule: మరో 3 రోజుల్లో జీఎస్టీలో భారీ మార్పులు… బిజినెస్ చేసే వారు తప్పక తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

ఆగస్టు 1 నుంచి కొత్త జీఎస్టీ నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు, దుకాణాలు, ట్రేడింగ్ చేసే వారికి ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి. న్యూస్18 హిందీ కథనం ప్రకారం బిల్ తయారీ, సరుకు రవాణా ప్రక్రియల్లో కొత్త నిబంధనలు రావడంతో వివరాలు తప్పుగా నమోదు చేస్తే ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ జనరేట్ కావు. అందుకే వ్యాపారులు ముందుగానే తమ సాఫ్ట్‌వేర్, డేటాను అప్‌డేట్ చేసుకోవడం మంచిది. ప్రతి నెల మొదలయ్యే సమయంలో కొన్ని ఆర్థిక మార్పులు అమల్లోకి వస్తుంటాయి. ఆగస్టు 1 నుంచి కూడా పలు కీలక జీఎస్టీ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు నేరుగా వ్యాపారాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా బిల్ టు-షిప్ టు లావాదేవీలకు సంబంధించిన నిబంధనల్లో పెద్ద మార్పు రానుంది. ఇకపై ఇలాంటి లావాదేవీల్లో షిప్ టు జీఎస్టీఐఎన్ ఇవ్వడం తప్పనిసరి కానుంది. అలాగే ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ వ్యవస్థల్లో కొత్త వెరిఫికేషన్ విధానం అమలు చేయనున్నారు.

అవసరమైన వివరాలు సరిగ్గా నమోదు చేయకపోతే ఐఆర్‌ఎన్ (IRN) లేదా ఈ-వే బిల్ జనరేట్ కాదు. దీనివల్ల సరుకుల సరఫరాలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపార కార్యకలాపాలపై కూడా ప్రభావం పడొచ్చు. బిల్ టు-షిప్ టు లావాదేవీల్లో షిప్ టు జీఎస్టీఐఎన్ తప్పనిసరి. ఆగస్టు 1 నుంచి బిల్ టు-షిప్ టు, కాంబినేషన్ లావాదేవీల్లో షిప్ టు పార్టీకి సంబంధించిన జీఎస్టీఐఎన్ ఇవ్వడం తప్పనిసరి అవుతుంది. షిప్ టు పార్టీ జీఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉంటే, దాని సరైన జీఎస్టీఐఎన్ నమోదు చేయాలి. ఒకవేళ షిప్ టు పార్టీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే, యూఆర్‌పీ (URP – Unregistered Person) అని నమోదు చేయాలి. ఈ నిబంధన మూడు రకాల లావాదేవీలకు వర్తిస్తుంది. అవి ఐఆర్‌ఎన్, విడిగా జారీ చేసే ఈ-వే బిల్స్, ఐఆర్‌ఎన్ ఆధారంగా రూపొందించే ఈ-వే బిల్స్.

ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ వ్యవస్థల్లో కొత్త వెరిఫికేషన్

కొత్త నిబంధనల ప్రకారం షిప్ టు జీఎస్టీఐఎన్, షిప్ టు స్టేట్ కోడ్, షిప్ టు పిన్ కోడ్, బిల్ టు జీఎస్టీఐఎన్, షిప్ టు జీఎస్టీఐఎన్ వివరాలను సిస్టమ్ తనిఖీ చేస్తుంది. ఈ వివరాల్లో ఏదైనా తప్పుగా లేదా అసంపూర్తిగా ఉంటే ఈ-ఇన్వాయిస్‌కు సంబంధించిన ఐఆర్‌ఎన్ లేదా ఈ-వే బిల్ జారీ కాదు. అందుకే కస్టమర్ల వివరాలు, డెలివరీ అడ్రస్‌లు, ఇతర రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో వ్యాపారులు ముందుగానే చూసుకోవాలి.

జీఎస్టీఎన్ (GSTN) ఇప్పుడు వాలంటరీ ఈ-వే బిల్ క్లోజర్ అనే కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా సరుకుల డెలివరీ పూర్తయిన తర్వాత సరఫరాదారు, సరుకు అందుకునే వ్యక్తి లేదా ట్రాన్స్‌పోర్టర్ ఈ-వే బిల్‌ను పోర్టల్ లేదా ఏపీఐ ద్వారా స్వయంగా క్లోజ్ చేయవచ్చు. దీంతో అవసరం లేకుండా ఓపెన్‌లో ఉండిపోయే ఈ-వే బిల్స్ సమస్య తగ్గుతుంది. రికార్డులను కూడా సులభంగా నిర్వహించుకోవచ్చు.

వ్యాపారులు ఏం చేయాలి?

ఆగస్టు 1కు ముందే తమ ఈఆర్‌పీ (ERP) లేదా బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. కస్టమర్ల వివరాలు, డెలివరీ లొకేషన్లకు సంబంధించిన మాస్టర్ డేటాను తనిఖీ చేయాలి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని కస్టమర్ల కోసం యూఆర్‌పీ ఆప్షన్ అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ సిస్టమ్ పనిచేస్తుందో లేదో ముందుగానే పరీక్షించుకోవడం మంచిది. ఇలా చేస్తే తర్వాత ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.

ఈ కొత్త మార్పులు ప్రధానంగా బిల్ టు-షిప్ టు, వాటికి సంబంధించిన లావాదేవీలకు వర్తిస్తాయి. సాధారణ జీఎస్టీ లావాదేవీలపై వీటి ప్రభావం నేరుగా ఉండదు. అయితే బిల్ టు-షిప్ టు విధానంలో వ్యాపారం చేసే సంస్థలు ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ రూపొందించడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఆగస్టు 1 నుంచి వచ్చే ఈ జీఎస్టీ మార్పులు వ్యాపార లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో తీసుకొస్తున్నారు. సరైన వివరాలను నమోదు చేసి, తమ సిస్టమ్‌లను ముందుగానే సిద్ధం చేసుకున్న వ్యాపారులకు ఈ మార్పులతో పెద్ద ఇబ్బందులు ఉండవు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 July 2026, 3:21 pm Digital Edition : Prabhanews
GST New Rule: మరో 3 రోజుల్లో జీఎస్టీలో భారీ మార్పులు… బిజినెస్ చేసే వారు తప్పక తెలుసుకోండి | New GST Rules From August 1 | బిజినెస్

Last Updated:Jul 27, 2026 3:13 PM ISTఆగస్టు 1 నుండి కొత్త జీఎస్టీ నిబంధనలు అమలులోకి రానున్నాయి. బిల్ టు-షిప్ టు లావాదేవీలకు షిప్ టు జీఎస్టీఐఎన్ తప్పనిసరి. ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ వ్యవస్థల్లో కొత్త వెరిఫికేషన్ ఉంటుంది.GST New Rule: మరో 3 రోజుల్లో జీఎస్టీలో భారీ మార్పులు... బిజినెస్ చేసే వారు తప్పక తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)ఆగస్టు 1 నుంచి కొత్త జీఎస్టీ నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు, దుకాణాలు, ట్రేడింగ్ చేసే వారికి ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి. న్యూస్18 హిందీ కథనం ప్రకారం బిల్ తయారీ, సరుకు రవాణా ప్రక్రియల్లో కొత్త నిబంధనలు రావడంతో వివరాలు తప్పుగా నమోదు చేస్తే ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ జనరేట్ కావు. అందుకే వ్యాపారులు ముందుగానే తమ సాఫ్ట్‌వేర్, డేటాను అప్‌డేట్ చేసుకోవడం మంచిది. ప్రతి నెల మొదలయ్యే సమయంలో కొన్ని ఆర్థిక మార్పులు అమల్లోకి వస్తుంటాయి. ఆగస్టు 1 నుంచి కూడా పలు కీలక జీఎస్టీ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు నేరుగా వ్యాపారాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా బిల్ టు-షిప్ టు లావాదేవీలకు సంబంధించిన నిబంధనల్లో పెద్ద మార్పు రానుంది. ఇకపై ఇలాంటి లావాదేవీల్లో షిప్ టు జీఎస్టీఐఎన్ ఇవ్వడం తప్పనిసరి కానుంది. అలాగే ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ వ్యవస్థల్లో కొత్త వెరిఫికేషన్ విధానం అమలు చేయనున్నారు.అవసరమైన వివరాలు సరిగ్గా నమోదు చేయకపోతే ఐఆర్‌ఎన్ (IRN) లేదా ఈ-వే బిల్ జనరేట్ కాదు. దీనివల్ల సరుకుల సరఫరాలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపార కార్యకలాపాలపై కూడా ప్రభావం పడొచ్చు. బిల్ టు-షిప్ టు లావాదేవీల్లో షిప్ టు జీఎస్టీఐఎన్ తప్పనిసరి. ఆగస్టు 1 నుంచి బిల్ టు-షిప్ టు, కాంబినేషన్ లావాదేవీల్లో షిప్ టు పార్టీకి సంబంధించిన జీఎస్టీఐఎన్ ఇవ్వడం తప్పనిసరి అవుతుంది. షిప్ టు పార్టీ జీఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉంటే, దాని సరైన జీఎస్టీఐఎన్ నమోదు చేయాలి. ఒకవేళ షిప్ టు పార్టీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే, యూఆర్‌పీ (URP - Unregistered Person) అని నమోదు చేయాలి. ఈ నిబంధన మూడు రకాల లావాదేవీలకు వర్తిస్తుంది. అవి ఐఆర్‌ఎన్, విడిగా జారీ చేసే ఈ-వే బిల్స్, ఐఆర్‌ఎన్ ఆధారంగా రూపొందించే ఈ-వే బిల్స్.ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ వ్యవస్థల్లో కొత్త వెరిఫికేషన్కొత్త నిబంధనల ప్రకారం షిప్ టు జీఎస్టీఐఎన్, షిప్ టు స్టేట్ కోడ్, షిప్ టు పిన్ కోడ్, బిల్ టు జీఎస్టీఐఎన్, షిప్ టు జీఎస్టీఐఎన్ వివరాలను సిస్టమ్ తనిఖీ చేస్తుంది. ఈ వివరాల్లో ఏదైనా తప్పుగా లేదా అసంపూర్తిగా ఉంటే ఈ-ఇన్వాయిస్‌కు సంబంధించిన ఐఆర్‌ఎన్ లేదా ఈ-వే బిల్ జారీ కాదు. అందుకే కస్టమర్ల వివరాలు, డెలివరీ అడ్రస్‌లు, ఇతర రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో వ్యాపారులు ముందుగానే చూసుకోవాలి.జీఎస్టీఎన్ (GSTN) ఇప్పుడు వాలంటరీ ఈ-వే బిల్ క్లోజర్ అనే కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా సరుకుల డెలివరీ పూర్తయిన తర్వాత సరఫరాదారు, సరుకు అందుకునే వ్యక్తి లేదా ట్రాన్స్‌పోర్టర్ ఈ-వే బిల్‌ను పోర్టల్ లేదా ఏపీఐ ద్వారా స్వయంగా క్లోజ్ చేయవచ్చు. దీంతో అవసరం లేకుండా ఓపెన్‌లో ఉండిపోయే ఈ-వే బిల్స్ సమస్య తగ్గుతుంది. రికార్డులను కూడా సులభంగా నిర్వహించుకోవచ్చు.వ్యాపారులు ఏం చేయాలి?ఆగస్టు 1కు ముందే తమ ఈఆర్‌పీ (ERP) లేదా బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. కస్టమర్ల వివరాలు, డెలివరీ లొకేషన్లకు సంబంధించిన మాస్టర్ డేటాను తనిఖీ చేయాలి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని కస్టమర్ల కోసం యూఆర్‌పీ ఆప్షన్ అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ సిస్టమ్ పనిచేస్తుందో లేదో ముందుగానే పరీక్షించుకోవడం మంచిది. ఇలా చేస్తే తర్వాత ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.ఈ కొత్త మార్పులు ప్రధానంగా బిల్ టు-షిప్ టు, వాటికి సంబంధించిన లావాదేవీలకు వర్తిస్తాయి. సాధారణ జీఎస్టీ లావాదేవీలపై వీటి ప్రభావం నేరుగా ఉండదు. అయితే బిల్ టు-షిప్ టు విధానంలో వ్యాపారం చేసే సంస్థలు ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్ రూపొందించడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఆగస్టు 1 నుంచి వచ్చే ఈ జీఎస్టీ మార్పులు వ్యాపార లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో తీసుకొస్తున్నారు. సరైన వివరాలను నమోదు చేసి, తమ సిస్టమ్‌లను ముందుగానే సిద్ధం చేసుకున్న వ్యాపారులకు ఈ మార్పులతో పెద్ద ఇబ్బందులు ఉండవు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link