ఫ్యూచర్స్ మార్కెట్‌లోనే కాకుండా, భౌతిక బంగారం కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన బులియన్ మార్కెట్‌లోనూ ధరలు పెరిగాయి. సోమవారం ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం, ఇండియన్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.280 పెరిగి రూ.1,48,540కు చేరుకుంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఈ పెరుగుదల నమోదైంది. ఇక ఆభరణాల తయారీలో సాధారణంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,160 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛత ఎక్కువగా ఉండగా, 22 క్యారెట్ల బంగారంలో ఇతర లోహాలను కలుపుతారు. అందువల్ల ఈ రెండు రకాల బంగారం ధరల్లో తేడా ఉంటుంది. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు బంగారం స్వచ్ఛతతో పాటు తరుగు, మజూరీ, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

