“బంగారం ధరలు మలుపు తిరిగిన సమయాన్ని నేను సరిగ్గా గుర్తించినట్టున్నాను. నేను నిన్న కొనుగోలు చేసినప్పటి నుంచి బంగారం ధర 62 డాలర్లు పెరిగింది. జిమ్ రికార్డ్స్ అంచనా సరైనదైతే, బంగారం ధర 35 వేల డాలర్ల వరకు వెళ్లే బుల్ రన్ ప్రారంభం కావచ్చు. ఆయన అంచనా సరైనదేనని నేను నమ్ముతున్నాను. మీ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఫైనాన్షియల్ మార్కెట్లు ఎలా పైకి, కిందికి కదులుతాయో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం అంత సులభం కాదు. నాకు కూడా దీన్ని నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయినా, మళ్లీ కాలేజీకి వెళ్లి స్టూడెంట్ లోన్ అప్పులు చేయడం కంటే ఇది చాలా మంచిది. ప్రపంచంలో అత్యంత చెడ్డ అప్పుల్లో స్టూడెంట్ లోన్ కూడా ఒకటి. మీ ఆర్థిక భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన విషయంగా దీన్ని చెబుతున్నాను. సులభంగా చెప్పాలంటే, టెక్నికల్ అనాలిసిస్‌పై పూర్తి పట్టు సాధిస్తే, మార్కెట్ పెరిగినా, పడిపోయినా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి” అని రాబర్ట్ కియోసాకి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)

