2026 మార్చి 31 నాటికి యోగలోన్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.708 కోట్లు. కంపెనీకి సుమారు 32,000 మంది గోల్డ్ లోన్ కస్టమర్లు ఉన్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 162 బ్రాంచ్‌ల ద్వారా సేవలు అందిస్తోంది. కేరళలోని త్రిస్సూర్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న యోగలోన్స్ 1991లో స్థాపించబడింది. గోల్డ్ లోన్లతో పాటు వెహికల్ లోన్లు, బిజినెస్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు, టర్మ్ లోన్లు, మైక్రోఫైనాన్స్ లోన్లు కూడా అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)

