అందులో నుంచి ‘రజనీకాంత్’ అనే పేరును ఎంచుకున్నారు. రజని అంటే రాత్రి అని, కాంత్ అంటే వెలుగు అని అర్థం. నలుపు రంగులో ఉండే ఇతను వెండితెరపై ఒక వెలుగు వెలుగుతాడని ఆయన ఆ పేరును ఫిక్స్ చేసినట్లు ది హిందూ కథనం పేర్కొంది. అలా 1975 హోలీ పండుగ రోజున శివాజీ రావు గైక్వాడ్ కాస్తా ‘రజనీకాంత్’గా మారాడు. ఒక దర్శకుడు తన శిష్యుడికి పెట్టిన ఆ పేరు, ఆ తర్వాత కాలంలో భారతీయ సినిమా చరిత్రలోనే ఒక పెను సంచలనంగా మారింది. ఆ పేరే ఇప్పుడు ఒక బ్రాండ్, ఒక పవర్, ఒక ఎమోషన్.

