ప్రభన్యూస్

Sonam Wangchuk: అర్ధరాత్రి హైడ్రామా.. 26 రోజుల తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ! |


Last Updated:

Sonam Wangchuk: NEET ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

సోనమ్ వాంగ్‌చుక్
సోనమ్ వాంగ్‌చుక్

దేశంలో హింస చెలరేగే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో, ప్రభుత్వం నుంచి లభించిన హామీల మేరకు ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి విరమించారు. గురువారం అర్ధరాత్రి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

చకచకా ప్రభుత్వ నిర్ణయాలు

విద్యార్థుల ఆందోళన ఉధృతం కావడం, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఉదయం, రాత్రి రెండుసార్లు పరిస్థితిపై స్పందించిన ప్రధాని.. లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాని ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది:

ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నోటిఫై: NEET పేపర్ లీకేజీలపై వేగవంతమైన క్రిమినల్ విచారణ జరిపేందుకు దిల్లీ హైకోర్టు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానాన్ని నోటిఫై చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణం నుంచి పనిచేసే ఈ ప్రత్యేక కోర్టుకు అను గ్రోవర్ బలిగను న్యాయాధికారిగా నియమించారు.

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బదిలీ: వివాదం నేపథ్యంలో కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేసి, ఆయన స్థానంలో నరేష్ గంగ్వార్‌ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. అలాగే టీకే అనిల్ కుమార్‌ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఉపేక్షించం: ప్రధాని మోదీ

విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థులు శాంతించాలని, వారి ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

నేడు కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ

మరోవైపు ఆందోళనలు నిర్వహిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ప్రతినిధులతో కేంద్ర మంత్రులు శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తటస్థ వేదికపై ఈ చర్చలు జరగనున్నాయి. తమ డిమాండ్ల అమలుపై స్పష్టమైన హామీ వచ్చే వరకు చట్టబద్ధ పోరాటం కొనసాగుతుందని ఉద్యమ నేతలు స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 4:23 am Digital Edition : Prabhanews
Sonam Wangchuk: అర్ధరాత్రి హైడ్రామా.. 26 రోజుల తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ! |

Last Updated:Jul 24, 2026 4:16 AM ISTSonam Wangchuk: NEET ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.సోనమ్ వాంగ్‌చుక్దేశంలో హింస చెలరేగే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో, ప్రభుత్వం నుంచి లభించిన హామీల మేరకు ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి విరమించారు. గురువారం అర్ధరాత్రి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.చకచకా ప్రభుత్వ నిర్ణయాలువిద్యార్థుల ఆందోళన ఉధృతం కావడం, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఉదయం, రాత్రి రెండుసార్లు పరిస్థితిపై స్పందించిన ప్రధాని.. లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాని ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది:ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నోటిఫై: NEET పేపర్ లీకేజీలపై వేగవంతమైన క్రిమినల్ విచారణ జరిపేందుకు దిల్లీ హైకోర్టు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానాన్ని నోటిఫై చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణం నుంచి పనిచేసే ఈ ప్రత్యేక కోర్టుకు అను గ్రోవర్ బలిగను న్యాయాధికారిగా నియమించారు.ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బదిలీ: వివాదం నేపథ్యంలో కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేసి, ఆయన స్థానంలో నరేష్ గంగ్వార్‌ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. అలాగే టీకే అనిల్ కుమార్‌ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఉపేక్షించం: ప్రధాని మోదీవిద్యార్థుల భవిష్యత్తును కాలరాసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థులు శాంతించాలని, వారి ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.నేడు కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీమరోవైపు ఆందోళనలు నిర్వహిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ప్రతినిధులతో కేంద్ర మంత్రులు శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తటస్థ వేదికపై ఈ చర్చలు జరగనున్నాయి. తమ డిమాండ్ల అమలుపై స్పష్టమైన హామీ వచ్చే వరకు చట్టబద్ధ పోరాటం కొనసాగుతుందని ఉద్యమ నేతలు స్పష్టం చేశారు.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link