భారతదేశ ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయత, నాణ్యత, సాంకేతికతకు ప్రతీకగా నిలిచిన ప్రముఖ కంపెనీల్లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఒకటి. ద్విచక్ర వాహనాల తయారీలో దేశంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన టీవీఎస్, స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశీయ మార్కెట్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తన ఉనికిని బలంగా చాటుకుంటూ 80కి పైగా దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తోంది. భారత్‌లో జూపిటర్ (Jupiter), అపాచీ (Apache), రైడర్ (Raider), ఎన్‌టార్క్ (NTORQ), రేడియన్ (Radeon), స్పోర్ట్ (Sport), ఐక్యూబ్ (iQube) వంటి మోడళ్లతో టీవీఎస్ మంచి మార్కెట్ వాటాను సంపాదించింది.

