ఏ బుకింగ్‌లకు ఆఫర్ వర్తిస్తుంది?
ఈ ఆఫర్ దేశీయ ప్రయాణాలకు సంబంధించిన ఎకానమీ క్లాస్, ఇండిగోస్ట్రెచ్ (IndiGoStretch) బుకింగ్‌లకు వర్తిస్తుంది. ఇందులో వన్-వే, రిటర్న్ జర్నీ, నాన్‌స్టాప్ విమానాలు, కనెక్టింగ్ ఫ్లైట్స్, మల్టీ-సిటీ ప్రయాణాలు కూడా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ విమాన బుకింగ్‌లు, కోడ్‌షేర్ బుకింగ్‌లు, ఇతర పరోక్ష ఛానళ్ల ద్వారా చేసిన బుకింగ్‌లు, ఆఫర్ కాలంలో నిర్ధారణ కాని ‘Fare Hold’ బుకింగ్‌లు ఈ ప్రచారానికి అర్హత పొందవని ఇండిగో తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలులో ఉన్నప్పటికీ, తమిళనాడు రాష్ట్రంలో మాత్రం వర్తించదని ఇండిగో పేర్కొంది. తమిళనాడు ప్రైజ్ స్కీమ్‌ల నిషేధ చట్టం, 1979 నిబంధనల కారణంగా ఆ రాష్ట్ర నివాసితులు ఈ కార్యక్రమంలో పాల్గొనలేరని తెలిపింది. అలాగే ఇండిగో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థల ఉద్యోగులు, ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ఏజెన్సీల సిబ్బంది ఈ ఆఫర్‌కు అర్హులు కాదని సంస్థ స్పష్టం చేసింది.

