మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో తొలి నోటు 2016 నవంబర్ 8న విడుదలైంది. అది కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000 నోటు. ఈ నోటు థీమ్ మంగళయాన్. తర్వాత ఈ సిరీస్‌ను రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లకు కూడా విస్తరించారు. దీంతో కొత్త డిజైన్‌లోనూ గాంధీ ఫొటో భారత కరెన్సీకి ప్రధాన గుర్తింపుగా కొనసాగింది. ప్రస్తుతం మహాత్మా గాంధీ ఫొటో ఉన్న ఏడు డినామినేషన్ల నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతున్నాయి. అవి రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000. అంటే గాంధీ ఫొటో ఉన్న చెల్లుబాటు అయ్యే డినామినేషన్లు మొత్తం ఏడు. అయితే రూ.2,000 నోటు విషయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ నోటును చలామణి నుంచి వెనక్కి తీసుకున్నప్పటికీ, అది ఇప్పటికీ లీగల్ టెండర్‌గా, అంటే చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే నోటుగానే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
