Last Updated:
వరంగల్ అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో జూలై 21-23 వరకు ఉచిత మెగా వైద్య శిబిరం. మధుమేహం, బీపీ, థైరాయిడ్ పరీక్షలు ఉచితం.
ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తిస్తే అనేక ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. ఆస్పత్రులకు వెళ్లలేని వారికి వారి ప్రాంతంలోనే నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స, ఆరోగ్య సలహాలు అందించడం వల్ల ఇలాంటి శిబిరాలు ప్రజలకు గొప్ప వరంగా నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో వరంగల్ నగర శివారులోని ఆరేపల్లి ప్రాంతంలో ఉన్న అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మూడు రోజుల పాటు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. జూలై 21, 22, 23 తేదీల్లో జరిగే ఈ ప్రత్యేక శిబిరంలో మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలను అందించనున్నట్లు ప్రముఖ జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు.
ఈ మెగా వైద్య శిబిరంలో మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, వైరల్ జ్వరాలు, ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి నిపుణులైన వైద్యులు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి తగిన సలహాలు, అవసరమైన చికిత్స అందించనున్నారు. అలాగే సీబీపీ (CBC), రక్తంలో చక్కెర పరీక్ష (Blood Sugar), సిరం క్రియాటినిన్ వంటి కీలక పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు. అదనంగా లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, హెచ్‌బీఏ1సీ (HbA1c) వంటి ముఖ్యమైన రక్త పరీక్షలపై 50 శాతం ప్రత్యేక రాయితీ కూడా అందుబాటులో ఉంటుంది.
బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా, నిర్లక్ష్యం చేస్తే గుండె, మూత్రపిండాలు, కంటి చూపు వంటి కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే తరచూ అలసట, తలనొప్పి, అధిక దాహం, బరువులో మార్పులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం 94598 75555 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉండటంతో, ఈ అరుదైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.
Warangal,Telangana
Jul 19, 2026 10:06 PM IST

