భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల సంఖ్య పెరిగే కొద్దీ సీట్ల వినియోగం, లగేజీ, శబ్దం, బెర్త్‌ల వినియోగం వంటి అంశాలపై చిన్నచిన్న వాగ్వాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా స్లీపర్ కోచ్‌లు, ఏసీ 3-టైర్ కోచ్‌లలో మిడిల్ బెర్త్ (Middle Berth) విషయంలో తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. పగటిపూటనే కొందరు ప్రయాణికులు మిడిల్ బెర్త్‌ను తెరిచి పడుకోవడంతో, లోయర్ బెర్త్‌లో కూర్చున్నవారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. దీంతో ప్రయాణికుల మధ్య మాటామాటా పెరిగి, కొన్నిసార్లు రైల్వే సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.

