కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, క్షేత్రస్థాయి విభాగాల్లో పనిచేస్తున్న లేదా రిటైర్ అయిన అధికారులు, ఉద్యోగులు అర్హులు కాదు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (PSEలు), వాటికి అనుబంధంగా ఉన్న సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో పనిచేసేవారికి కూడా అర్హత ఉండదు. స్థానిక సంస్థల్లో రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఈ జాబితాలోకి వస్తారు. అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), క్లాస్ IV, గ్రూప్ D ఉద్యోగులకు ఈ మినహాయింపు వర్తించదు. వారు PM-KMYలో చేరవచ్చు. గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు అర్హులు కాదు. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు (CAs), ఆర్కిటెక్ట్లు వంటి ప్రొఫెషనల్ బాడీల్లో రిజిస్టర్ అయి ప్రాక్టీస్ చేస్తున్నవారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. (ప్రతీకాత్మక చిత్రం)

