Last Updated:
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా అసాధారణ జీవిత ప్రయాణం, ఆయన సాధించిన విజయాలపై రాసిన ‘ఎటర్నల్ లైట్’ పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఘనంగా ఆవిష్కరించారు. దలైలామా స్వయంగా ఆశీర్వదించిన ఈ పుస్తక ఆవిష్కరణకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
టిబెట్ ఆధ్యాత్మిక గురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత 14వ దలైలామా అసాధారణ జీవితం, ఆయన వారసత్వం గురించి ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ అరవింద్ యాదవ్ రాసిన ‘ఎటర్నల్ లైట్: ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ ద 14త్ దలైలామా’ పుస్తకం న్యూఢిల్లీలో ఘనంగా విడుదలైంది. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని సెప్టెంబర్ 11న కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. పద్మవిభూషణ్, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కరణ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పద్మశ్రీ ప్రొఫెసర్ న్గావాంగ్ సామ్టెన్, పవన్ కే వర్మ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

