మీరు ప్రతి నెల రూ.3,000 SIP చేస్తే, 10 ఏళ్లలో మీ మొత్తం పెట్టుబడి రూ.3.60 లక్షలు అవుతుంది. ఏడాదికి సగటున 12% రాబడి వస్తే ఈ మొత్తం సుమారు రూ.6.97 లక్షలకు పెరగవచ్చు. అదే 15% రాబడి లభిస్తే సుమారు రూ.8.36 లక్షలకు చేరుకోవచ్చు. 15 ఏళ్ల పాటు SIP కొనసాగిస్తే మీ మొత్తం పెట్టుబడి రూ.5.40 లక్షలు అవుతుంది. 12% రాబడితో ఇది సుమారు రూ.15.14 లక్షలు, 15% రాబడితో సుమారు రూ.20.31 లక్షలకు చేరవచ్చు. ఇక 20 ఏళ్ల పాటు నెలకు రూ.3,000 పెట్టుబడి చేస్తే మొత్తం పెట్టుబడి రూ.7.20 లక్షలు అవుతుంది. 12% రాబడితో ఈ మొత్తం సుమారు రూ.29.97 లక్షలు, 15% రాబడితో సుమారు రూ.45.48 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ గణాంకాలు క్రమం తప్పకుండా దీర్ఘకాలం SIP కొనసాగిస్తే చక్రవడ్డీ ప్రభావంతో చిన్న పెట్టుబడి కూడా పెద్ద నిధిగా ఎలా మారుతుందో చూపిస్తున్నాయి. అయితే 12%, 15% రాబడులు కేవలం అంచనా మాత్రమే. మ్యూచువల్ ఫండ్లలో వాస్తవ రాబడి మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతుంది.

