ప్రస్తుతం యూరియా, డీఏపీ, ఎంఓపీ (MOP), సల్ఫర్ వంటి ఎరువులు, వాటి తయారీకి అవసరమైన ముడి సరుకుల అంతర్జాతీయ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 2026-27 రబీ సీజన్‌కు P&K ఎరువులపై కొత్త NBS సబ్సిడీ రేట్లను ఆమోదించింది. ఇందులో డీఏపీ, ఎన్పీకేఎస్ రకాల ఎరువులూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన, ఆమోదించిన రేట్ల ప్రకారం ఎరువుల కంపెనీలకు సబ్సిడీ అందించనుంది. తద్వారా రైతులకు ఎరువులు అందుబాటు ధరల్లో లభించేలా చూస్తుంది. మొత్తంగా చూస్తే, 2026-27 రబీ సీజన్లో ఎరువుల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాదితో పోలిస్తే అదనంగా రూ.24,417.73 కోట్లు కేటాయిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మారుతున్నా రైతులపై ఎరువుల ఖర్చు భారం తగ్గించి, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు సకాలంలో అందించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. (ప్రతీకాత్మక చిత్రం)

