Last Updated:
EV Scooter | ఇండియాలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ అయింది. రూ.1 లక్ష ప్రారంభ ధరతో వచ్చిన ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ (E3 Electric.AI) భారత్‌లో ఈ3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. అందుబాటు ధరలో కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. ఎన్‌డీటీవీ ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1 లక్షగా నిర్ణయించారు. ఈ స్కూటర్ సీ1, సీ1ఎక్స్, సీ2 అనే మూడు వేరియంట్లలో వస్తుంది. సీ1ఎక్స్ వేరియంట్ ధర బెంగళూరు ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.1,09,999గా ఉంది. సీ2 వేరియంట్ ధర రూ.1,19,999. ప్రాథమిక సీ1 మోడల్‌లో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం బెంగళూరులో కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తర్వాత ఇతర మార్కెట్లకు కూడా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

