Last Updated:
ఏలూరు గ్రామ దేవత, భక్తుల ఇలవేల్పు శ్రీ గంగానమ్మ తల్లి వైభవాన్ని, భక్తిని అద్భుతంగా చాటిచెప్పే “ఏలూరు గంగానమ్మ ఆంథెమ్” మ్యూజిక్ వీడియో విడుదలై, ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా వేదికలపై విజయవంతంగా దూసుకుపోతోంది.
ఏలూరు గ్రామ దేవత, భక్తుల ఇలవేల్పు శ్రీ గంగానమ్మ తల్లి వైభవాన్ని, భక్తిని అద్భుతంగా చాటిచెప్పే “ఏలూరు గంగానమ్మ ఆంథెమ్” మ్యూజిక్ వీడియో విడుదలై, ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా వేదికలపై విజయవంతంగా దూసుకుపోతోంది. తరంగిణి ఒరిజినల్స్ యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన ఈ భక్తి గీతానికి భక్తులు, ప్రేక్షకుల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది.
సుమారు 150 సంవత్సరాల పైచిలుకు సుదీర్ఘ చరిత్ర, విశేష ప్రాముఖ్యత కలిగిన ఏలూరు గంగానమ్మ జాతరపై ఇప్పటివరకు ఒక్క ప్రత్యేక పాట కూడా లేకపోవడం గమనార్హం. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరకు ఎన్నో భక్తి గీతాలు ఉన్నట్లే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఏలూరు జాతర కోసం మొదటిసారిగా తరంగిణి ఒరిజినల్స్, గంగానమ్మ పిక్చర్స్ వారు ఈ ప్రతిష్టాత్మకమైన సాంగ్‌ను రూపొందించి సరికొత్త రికార్డు సృష్టించారు. విడుదలైన రోజు నుండి ఈ పాట భక్తుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ భక్తి గీతాన్ని గౌరవనీయ సినిమాటోగ్రఫీ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఘనంగా ఆవిష్కరించారు. ఏలూరు సంస్కృతిని, గంగానమ్మ జాతర విశిష్టతను ప్రతిబింబించేలా ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించిన చిత్ర బృందాన్ని ఈ సందర్భంగా మంత్రి గారు ప్రత్యేకంగా అభినందించారు.
తరంగిణి ఒరిజినల్స్, గంగానమ్మ పిక్చర్స్ బ్యానర్లపై సత్యవతి మోటేపల్లి మరియు దారపు ఛాయాదేవి గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ భారీ భక్తి గీతానికి మల్లిక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి నిర్మాణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. సాయి తేజ మోటేపల్లి అద్భుతమైన విజన్‌తో ఈ వీడియోకు దర్శకత్వం వహించగా, వంశీ మోటేపల్లి ప్రధాన పాత్రలో నటించి భక్తులను ఆకట్టుకున్నారు.
ప్రముఖ గాయకుడు ధనుంజయ్ సీపాన తన పవర్ఫుల్, అద్భుతమైన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. సత్య కశ్యప్ అందించిన భక్తి పారవశ్యం కలిగించే సంగీతం, యువ కిరణ్ సమకూర్చిన పవర్ఫుల్ సాహిత్యం భక్తులలో పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.
ఈ గీతంలో మిగిలిన ప్రధాన నటీనటులుగా మేకల కల్యాణ్ నాయుడు , నవ్య తమ అద్భుతమైన నటనతో మెప్పించగా, నెగెటివ్ రోల్లో గంగ తన పవర్ఫుల్ నటనతో అలరించారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్‌గా దేవాన్షి నటించగా, ఏలూరు గంగానమ్మ తల్లి పవర్ఫుల్ పాత్రలో శ్రీయ బెందాడి ఒదిగిపోయి భక్తులకు సాక్షాత్తు అమ్మవారిని కళ్లముందు సాక్షాత్కరింపజేశారు.
ఈ వీడియోకు మేకల నాగేంద్ర ఎడిటర్‌గా మరియు పోస్టర్ డిజైనర్‌గా వ్యవహరించి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఈ చిత్ర మేకింగ్‌లో అసోసియేట్ డైరెక్టర్ నాగి రెడ్డి (Nagi Reddy) కీలక పాత్ర పోషించి తన నైపుణ్యాన్ని అందించారు. జాతర వాతావరణాన్ని, భక్తిని తన కొరియోగ్రఫీతో కళ్లకు కట్టినట్లు చూపించి, పాటను మరింత ఎనర్జిటిక్‌గా మార్చారు డాన్స్ మాస్టర్ సాగర్ వేలూరు (Sagar VELURU). జాతర నేపథ్యాన్ని విజువల్‌గా ఎంతో గ్రాండ్‌గా చూపించడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ (Art Department) నుండి లోయ సాయి (Loya Sai), మాగంటి ఏడుకొండలు (Maganti Edukondalu), తుంగ జయంత్ (Thunga Jayanth) అందించిన సహకారం అమోఘం.
ఏలూరు స్థానిక సంస్కృతిని, భక్తి రసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ గీతం విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు స్థానిక ప్రేక్షకుల మరియు భక్తుల ఆదరణతో నిరంతరం వైరల్‌గా షేర్ అవుతోంది. భక్తులు ఈ పూర్తి వీడియో సాంగ్‌ను తరంగిణి ఒరిజినల్స్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించవచ్చు.

