Last Updated:
‘రంగస్థలం’ లాంటి అరివీర భయంకర హిట్టు తర్వాత మళ్లీ సుక్కు-రామ్ చరణ్ కాంబినేషన్ కోసం యావత్ తెలుగు సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
‘రంగస్థలం’ లాంటి అరివీర భయంకర హిట్టు తర్వాత మళ్లీ సుక్కు-రామ్ చరణ్ కాంబినేషన్ కోసం యావత్ తెలుగు సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రంగస్థలం తర్వాత పుష్ప సిరీస్‌తో ఓ వైపు లెక్కల మాస్టార్ బిజీ అయిపోగా.. చెర్రీ కూడా ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్, పెద్ది సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయాడు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. తాజాగా సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా లాంఛ్ అయింది.
The journey of #RC17 begins with the MEGA CLAP ❤️
Megastar @KChiruTweets garu sounded the clapboard and blessed the entire team of #RC17 ✨#YouCanImagine #RC2Sukku
#SRCMega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
— #RC17 (@RC17Offl) November 1, 2026
ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్‌తో పాటు ఈ మూవీ నిర్మాతలు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిరంజీవి సమక్షంలో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా వేడుకతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గతంలో రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సహజంగానే భారీ ఆసక్తి ఏర్పడింది.
ఈ సినిమా ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు. నిర్మాత దిల్ రాజు, దర్శకులు హరీశ్ శంకర్, బుచ్చిబాబు సానా, మారుతి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దీంతో రామానాయుడు స్టూడియోలో సందడి వాతావరణం నెలకొంది. సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తికావడంతో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే షూటింగ్ షెడ్యూల్స్, ఇతర నిర్మాణ వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్స్‌తో చాలా సినిమాలను ముందుండి నడిపాడు.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి అనే ఎన్నారై తెలుగమ్మాయి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ నటించిన ఆకాశంలో ఒకతార సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. సుకుమార్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచే.. తన సినిమాలో తెలుగమ్మాయిని హీరోయిన్‌గా పెట్టాలని అనుకుంటున్నాడు. కానీ ఏ సినిమాకు కూడా పలు కారణాల వల్ల కుదరలేకపోయిందట. దాంతో ఈ సారి పక్కా తెలుగమ్మాయినే తన సినిమాలో పెట్టుకోవాలని ఫిక్సయ్యాడట. అలా సాత్వికను ఫైనల్ చేశాడని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

