Last Updated:
E20 Ethanol Blending: పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని మరింత పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అధిక ఇథనాల్‌ను వినియోగించుకునేలా ఫ్లెక్సీ-ఫ్యూయల్ వాహనాలను ప్రోత్సహించనున్నట్లు ప్రధాని సలహాదారు తరుణ్ కపూర్ తెలిపారు. త్వరలోనే ప్రముఖ కార్ల కంపెనీలు ఈ వాహనాలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
దేశ ఇంధన రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన భద్రతను సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, పెట్రోల్‌లో ప్రస్తుతం కలుపుతున్న 20 శాతం ఇథనాల్ (E20) స్థాయిని భవిష్యత్తులో మరింత పెంచడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి సలహాదారు తరుణ్ కపూర్ వెల్లడించారు. ఈ అధిక ఇథనాల్ మిశ్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా ‘ఫ్లెక్సీ-ఇంధన వాహనాల’ (Flex-fuel vehicles) వాడకాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బుధవారం వర్చువల్ పద్ధతిలో జరిగిన ‘ది ఇండియా షుగర్ అండ్ బయో-ఎనర్జీ కాన్ఫరెన్స్ 2026’ నాలుగవ ఎడిషన్‌లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

