బిగ్ బాస్ ఆట మొదలైందంటే చాలు.. ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో, ఎవరి గేమ్ ఎప్పుడు మారిపోతుందో ఊహించడం కష్టం. కంటెస్టెంట్లు తమదైన స్ట్రాటజీలతో గేమ్ ఆడుతున్నా.. బిగ్ బాస్ తీసుకునే ఒక్క నిర్ణయం వారి పరిస్థితిని తలకిందులు చేస్తుంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తొలి వారం నుంచే టాస్కులు, గొడవలు, వ్యూహాలు, ఎమోషన్స్‌తో హౌస్‌లో వాతావరణం వేడెక్కిపోయింది.

