Collar cleaning: షర్ట్ ఎంత ఉతికినా కాలర్‌పై మరకలు పోవట్లేదా.. అసలు కారణం ఇదే..! collar stains causes prevention tips | లైఫ్ స్టైల్
Last Updated:Sep 10, 2026 9:31 AM ISTచొక్కా కాలర్‌పై మరకలకు చెమట, చర్మ నూనె, క్రీములు, పెర్ఫ్యూమ్‌లు కారణం. ఇవి బట్టకు అంటుకుని మురికిగా మారతాయి.ఈ సమస్య రాకుండా ఉండాలంటే చెమట పట్టిన చొక్కాలను ఎక్కువ రోజులు ఉతకకుండా ఉంచకూడదు. చొక్కా తీసిన వెంటనే కాలర్‌ను ఒకసారి పరిశీలించి.. అవసరమైతే ఉతకడానికి ముందు ఆ భాగాన్ని విడిగా శుభ్రం చేయాలి. చెమట పట్టిన బట్టలను మురికి బట్టల కుప్పలో ఎక్కువసేపు వేయకుండా త్వరగా ఉతకడం మంచిది. అలాగే మెడకు క్రీమ్, పెర్ఫ్యూమ్ లేదా ఇతర ఉత్పత్తులు వాడినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే చొక్కా వేసుకుంటే కాలర్‌పై మరకలు పడే అవకాశం కొంత వరకు తగ్గుతుంది.చొక్కాను ఎంత శుభ్రంగా ఉతికినా.. కాలర్ దగ్గర మాత్రం పసుపు, గోధుమ, ముదురు రంగు మరకలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెల్లటి షర్టుల విషయంలో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ మరకలకు చెమట ఒక్కటే కారణం కాదు. చెమటతో పాటు చర్మం నుంచి వచ్చే సహజ నూనె, దుమ్ము, రోజూ వాడే కొన్ని క్రీములు, పెర్ఫ్యూమ్‌లు వంటి పదార్థాలు కలిసి కాలర్‌పై పేరుకుపోతాయని విశాఖపట్నానికి చెందిన గృహిణి సాయి పల్లవి తెలిపారు.మరింత చదవండి
Source link