ప్రభన్యూస్

DNK మూవీ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద ఈ ‘దొంగ నా కొడుకు’ పరిస్థితి ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా DNK ‘దొంగ నా కొడుకు’. రఘుబాబు, అలీ, రజిత భాగమైన ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దామా.

News18
News18

సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకొని వెండితెరపై అడుగుపెట్టిన యువ నటుడు మౌళి. గతేడాది ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న అతను.. తాజాగా ‘డీఎన్‌కే’ (DNK) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు శ్రీను కంబాల తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ సినిమా ద్వారా మౌళి తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగించాడా? అసలు ఈ సినిమా కథేంటి? రివ్యూలో చూద్దాం.

కథ:

చదువును పక్కనపెట్టి షార్ట్ కట్స్‌లో ఈజీగా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు కావాలని కలలు కనే యువకుడు ఈశ్వర్ (మౌళి). ఆన్‌లైన్ జూదాలు, క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసైన కొడుకును చూసి తల్లిదండ్రులు (అలీ, రజిత) ఎంత మందలించినా పట్టించుకోడు. ఈ క్రమంలో దీపు (సుష్మిత శెట్టి) అనే ధనవంతుల అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను ఆసరాగా చేసుకుని, అత్యవసరం అని అబద్ధం చెప్పి రూ. 10 లక్షలు అప్పుగా తీసుకుంటాడు. ఆ డబ్బును బెట్టింగ్‌లో పెట్టి మొత్తం పోగొట్టుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న దీపు తండ్రి (రఘుబాబు).. తన డబ్బును వెంటనే తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హీరోకి వార్నింగ్ ఇస్తాడు. చేతిలో చిల్లిగవ్వ లేని ఈశ్వర్.. ఆ పది లక్షలు ఎలా సంపాదించాడు? ఈ క్రమంలో అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:

ఇండస్ట్రీలో ఎప్పటినుంచో నలిగిపోయిన పాత కథలనే అటూ ఇటూ మార్చి తీయడం పరిపాటిగా మారింది. ‘డీఎన్‌కే’ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. దర్శకుడు శ్రీను కంబాల ఎంచుకున్న క్రైమ్ కామెడీ పాయింట్ రొటీన్‌గా ఉంది. ఈ సినిమా కథను స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. కానీ, దర్శకుడు ఆ దిశగా ప్రయత్నించకుండా అత్యంత పేలవంగా, ఏమాత్రం ఆసక్తికరం కాని కథనంతో ప్రేక్షకులకు నీరసం తెప్పించాడు. ఒక సాధారణ కామెడీ క్యారెక్టర్ చేయాల్సిన హీరోకి, స్టార్ హీరోల తరహాలో ఓవర్ ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ ఇవ్వడం అస్సలు సింక్ కాలేదు. దీనికి తోడు కామెడీ పేరుతో ‘గే’ పాత్రను వాడుకోవడం, డబుల్ మీనింగ్ డైలాగులను నమ్ముకోవడం విసుగు తెప్పిస్తుంది. టెక్నికల్‌గా కెమెరా వర్క్, నిర్మాణ విలువలు మాత్రమే కాస్త పర్వాలేదనిపిస్తాయి. సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ సినిమాకు అతిపెద్ద మైనస్.

నటీనటుల పనితీరు:

మౌళి తన సహజమైన కామెడీ టైమింగ్‌తో కొన్ని సీన్స్‌లో నవ్వించినా, బలవంతపు మాస్ ఎలివేషన్స్ వల్ల తేలిపోయాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే న్యాచురల్ కథలను ఎంచుకుంటే ప్రామిసింగ్ హీరోగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. హీరోయిన్ సుష్మిత శెట్టి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సీనియర్ నటులు రఘుబాబు, అలీ, రజిత, భద్రం తదితరులు ఉన్నా వారి పాత్రలు రొటీన్‌గానే సాగుతాయి. సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ లౌడ్‌గా అరవడమే తప్ప న్యాచురాలిటీ మిస్సయింది.

మొత్తంగా చెప్పాలంటే.. ఈ దొంగ నా కొడుకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు.

రేటింగ్: 2



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 5:35 pm Digital Edition : Prabhanews
DNK మూవీ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద ఈ ‘దొంగ నా కొడుకు’ పరిస్థితి ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 13, 2026 5:26 PM IST'లిటిల్ హార్ట్స్' ఫేమ్ మౌళి ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా DNK ‘దొంగ నా కొడుకు’. రఘుబాబు, అలీ, రజిత భాగమైన ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దామా. News18సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకొని వెండితెరపై అడుగుపెట్టిన యువ నటుడు మౌళి. గతేడాది 'లిటిల్ హార్ట్స్' చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న అతను.. తాజాగా 'డీఎన్‌కే' (DNK) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు శ్రీను కంబాల తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ సినిమా ద్వారా మౌళి తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగించాడా? అసలు ఈ సినిమా కథేంటి? రివ్యూలో చూద్దాం.కథ:చదువును పక్కనపెట్టి షార్ట్ కట్స్‌లో ఈజీగా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు కావాలని కలలు కనే యువకుడు ఈశ్వర్ (మౌళి). ఆన్‌లైన్ జూదాలు, క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసైన కొడుకును చూసి తల్లిదండ్రులు (అలీ, రజిత) ఎంత మందలించినా పట్టించుకోడు. ఈ క్రమంలో దీపు (సుష్మిత శెట్టి) అనే ధనవంతుల అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను ఆసరాగా చేసుకుని, అత్యవసరం అని అబద్ధం చెప్పి రూ. 10 లక్షలు అప్పుగా తీసుకుంటాడు. ఆ డబ్బును బెట్టింగ్‌లో పెట్టి మొత్తం పోగొట్టుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న దీపు తండ్రి (రఘుబాబు).. తన డబ్బును వెంటనే తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హీరోకి వార్నింగ్ ఇస్తాడు. చేతిలో చిల్లిగవ్వ లేని ఈశ్వర్.. ఆ పది లక్షలు ఎలా సంపాదించాడు? ఈ క్రమంలో అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అనేదే మిగతా కథ.విశ్లేషణ:ఇండస్ట్రీలో ఎప్పటినుంచో నలిగిపోయిన పాత కథలనే అటూ ఇటూ మార్చి తీయడం పరిపాటిగా మారింది. 'డీఎన్‌కే' కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. దర్శకుడు శ్రీను కంబాల ఎంచుకున్న క్రైమ్ కామెడీ పాయింట్ రొటీన్‌గా ఉంది. ఈ సినిమా కథను స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. కానీ, దర్శకుడు ఆ దిశగా ప్రయత్నించకుండా అత్యంత పేలవంగా, ఏమాత్రం ఆసక్తికరం కాని కథనంతో ప్రేక్షకులకు నీరసం తెప్పించాడు. ఒక సాధారణ కామెడీ క్యారెక్టర్ చేయాల్సిన హీరోకి, స్టార్ హీరోల తరహాలో ఓవర్ ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ ఇవ్వడం అస్సలు సింక్ కాలేదు. దీనికి తోడు కామెడీ పేరుతో 'గే' పాత్రను వాడుకోవడం, డబుల్ మీనింగ్ డైలాగులను నమ్ముకోవడం విసుగు తెప్పిస్తుంది. టెక్నికల్‌గా కెమెరా వర్క్, నిర్మాణ విలువలు మాత్రమే కాస్త పర్వాలేదనిపిస్తాయి. సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ సినిమాకు అతిపెద్ద మైనస్.నటీనటుల పనితీరు:మౌళి తన సహజమైన కామెడీ టైమింగ్‌తో కొన్ని సీన్స్‌లో నవ్వించినా, బలవంతపు మాస్ ఎలివేషన్స్ వల్ల తేలిపోయాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే న్యాచురల్ కథలను ఎంచుకుంటే ప్రామిసింగ్ హీరోగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. హీరోయిన్ సుష్మిత శెట్టి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సీనియర్ నటులు రఘుబాబు, అలీ, రజిత, భద్రం తదితరులు ఉన్నా వారి పాత్రలు రొటీన్‌గానే సాగుతాయి. సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ లౌడ్‌గా అరవడమే తప్ప న్యాచురాలిటీ మిస్సయింది.మొత్తంగా చెప్పాలంటే.. ఈ దొంగ నా కొడుకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు.రేటింగ్: 2మరింత చదవండి

Source link