గుండె జబ్బులు, అధిక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, అధిక బరువు, ఫ్యాటీ లివర్ లేదా తీవ్ర మధుమేహం ఉన్నవారు నూనెను రోజుకు 10 నుంచి 15 గ్రాముల లోపే పరిమితం చేయడం మంచిదని సూచిస్తున్నారు. సన్‌ఫ్లవర్, పల్లీల నూనెల్లో 100 గ్రాములకు సుమారు 884 క్యాలరీలు, 100 శాతం కొవ్వు ఉంటుంది. అయితే సన్‌ఫ్లవర్‌లో విటమిన్ E, పల్లీల నూనెలో విటమిన్ Eతో పాటు రెస్వెరాట్రాల్, ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. అందువల్ల నూనె ఎంపికతో పాటు దాని పరిమాణం, వంట విధానం కూడా ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతాయి.
