హోమ్‌బయ్యర్లు, బిల్డర్ల మధ్య ఒప్పంద సంబంధాలను నియంత్రించేందుకు పార్లమెంట్ రేరా చట్టాన్ని తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, హోమ్‌బయ్యర్ల ప్రయోజనాలను కాపాడటం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఎఫ్‌పీసీఈ అధ్యక్షుడు అభయ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, “చట్టంగా రేరా విఫలం కాలేదు. దాన్ని అమలు చేసే విధానమే విఫలమైంది. అమలు బలహీనపడితే ఎంత బలమైన చట్టమైనా ఆచరణలో పనిచేయదు” అని అన్నారు. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన రేరా ట్రాకర్ డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ డేటా మార్చి 2, 2026 నాటిది. దేశవ్యాప్తంగా సుమారు 27.6 లక్షల హోమ్‌బయ్యర్ కుటుంబాల డబ్బు బిల్డర్ల దగ్గరే చిక్కుకుపోయిందని నివేదిక అంచనా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
