భారతీయ టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది ‘బిగ్‌బాస్’ (Bigg Boss). హిందీలో ప్రారంభమైన ఈ షో సంచలన విజయాలు నమోదు చేయడంతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో కూడా ఫుల్ సక్సెస్ అయింది. బిగ్‌బాస్ అంటే కేవలం కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎమోషన్స్, ఫిజికల్ టాస్క్‌లు మాత్రమే కాదు.. వారాంతాల్లో వచ్చే హోస్ట్‌ల సందడి కూడా.

