Last Updated:
Bank Employees: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయాలని భావించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI)ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్ ఉద్యోగుల కోసం అమలు చేయాలని భావించిన ‘పనితీరు-ఆధారిత ప్రోత్సాహక’ (పెర్ఫార్మెన్స్-లింక్డ్ ఇన్సెంటివ్ – PLI) పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రస్తుత నిర్మాణంలో అనేక లోపాలు, అసమానతలు ఉన్నాయని, వాటిని వెంటనే సమీక్షించాలని కోరుతూ బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు చేసిన విజ్ఞప్తుల (ప్రాతినిధ్యం) మేరకే ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.

