I Hate Marriage: Gen Z ఆలోచనలకు అద్దం పట్టే ‘ఐ హేట్ మ్యారేజ్’ మూవీ.. వేరే లెవల్లో టీజర్..! | తెలుగు సినిమా వార్తలు
ఆర్య సినిమా బ్యానర్‌పై దయానంద్ మాదం, కార్తిక్ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమేశ్ రేణుకుంట్ల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తొలి సినిమా అయినప్పటికీ, నేటి యువత జీవితాల్లోని భావోద్వేగాలు, సంబంధాలు, వ్యక్తిగత నిర్ణయాలను తెరపై చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘అప్పుడే పెళ్లా’ లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్‌లో నిలవడంతో సినిమాపై ఆసక్తి మరింత…
