1. మెషీన్ నిండుగా బట్టలను కుక్కేయడం … సమయం, కరెంట్ ఆదా చేయాలనే ఉద్దేశంతో డ్రమ్‌లో పట్టనన్ని బట్టలను ఒకేసారి కుక్కేయడం అత్యంత సాధారణంగా చేసే తప్పు. ఇలా చేయడం వల్ల డ్రమ్‌లో బట్టలు సరిగ్గా తిరగడానికి తగినంత స్థలం ఉండదు. నీరు, సర్ఫ్ బట్టల ప్రతి భాగానికి చేరక మురికి సరిగ్గా వదలదు. అంతేకాకుండా అధిక బరువు వల్ల డ్రమ్ బేరింగ్‌లు, మోటారుపై తీవ్రమైన భారం పడి మెషీన్ నుంచి పెద్ద శబ్దాలు రావడం, మోటారు కాలిపోవడం వంటి మరమ్మతులు తలెత్తుతాయి. డ్రమ్‌లో ఎప్పుడూ కనీసం 25 శాతం స్థలాన్ని ఖాళీగా ఉంచాలి.

