Last Updated:
ప్యాకెట్‌పై ‘A2’ అని రాసి ఉందని మాత్రమే అది తప్పకుండా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని భావించడం సరైంది కాదు. నెయ్యి రకం కంటే మనం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, మొత్తం ఆహారం ఎలా ఉంది అనే విషయాలు కూడా చాలా ముఖ్యం.
ఇటీవల కాలంలో A2 నెయ్యి గురించి సోషల్ మీడియాలో, మార్కెట్లో చాలా ప్రచారం జరుగుతోంది. సాధారణ నెయ్యితో పోలిస్తే A2 నెయ్యి మరింత ఆరోగ్యకరమని, జీర్ణక్రియకు మంచిదని, గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని చాలామంది చెబుతున్నారు. దీంతో కొన్ని A2 నెయ్యి ఉత్పత్తులు సాధారణ నెయ్యి కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. అయితే ప్యాకెట్‌పై ‘A2’ అని రాసి ఉందని మాత్రమే అది తప్పకుండా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని భావించడం సరైంది కాదు. నెయ్యి రకం కంటే మనం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, మొత్తం ఆహారం ఎలా ఉంది అనే విషయాలు కూడా చాలా ముఖ్యం.

