Last Updated:
బిగ్ బాస్ హౌస్ లో రెండో రోజే వాతావరణం రణరంగాన్ని తలపిస్తోంది. సరికొత్త కంటెస్టెంట్లు, కొత్త రూల్స్‌తో మొదలైన ఈ సీజన్లో వివాదాలకు, ఎమోషన్స్‌కు ఏమాత్రం కొదవ లేదని తాజా ఎపిసోడ్ నిరూపించింది.
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 10 అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, హౌస్ లోకి అడుగుపెట్టిన రెండో రోజే వాతావరణం రణరంగాన్ని తలపిస్తోంది. సరికొత్త కంటెస్టెంట్లు, కొత్త రూల్స్‌తో మొదలైన ఈ సీజన్లో వివాదాలకు, ఎమోషన్స్‌కు ఏమాత్రం కొదవ లేదని తాజా ఎపిసోడ్ నిరూపించింది. మంగళవారం నాటి ఎపిసోడ్ ఎన్నో నాటకీయ పరిణామాలకు, కంటెస్టెంట్ల మధ్య తీవ్రమైన మాటల యుద్ధాలకు వేదికగా నిలిచింది.

