Last Updated:
మాస్ మహారాజా రవితేజ హీరోగా, సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. తాజాగా ఈ సినిమాపై మరో వివాదం నెలకొంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా, సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. రవితేజ మార్క్ ఎనర్జీకి, శివ నిర్వాణ ఎమోషనల్ టేకింగ్ తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గకుండా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అయితే, ఒకవైపు కమర్షియల్ సక్సెస్ సాధిస్తున్న ఈ సినిమా.. మరోవైపు వరుస వివాదాల్లో చిక్కుకుని హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహానికి గురైన ఈ చిత్రం, తాజాగా అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలతో సరికొత్త వివాదంలోకి అడుగుపెట్టింది.

