Last Updated:
Britain ATC: బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మంగళవారం ఒక్కరోజే యూకే విమానాశ్రయాల్లో 1,000కి పైగా విమానాలు రద్దయినట్లు ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ పోర్టల్ ‘ఫ్లైట్రాడార్24’ (Flightradar24) వెల్లడించింది. బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) తమ ఫ్లైట్ ప్రాసెసింగ్ సిస్టమ్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించింది. ఈ సమస్య పరిష్కారానికి ఇంజనీర్లు అత్యవసరంగా రంగంలోకి దిగారు. లండన్ హీత్రూ సహా ప్రధాన ఎయిర్పోర్టులకు రాకపోకలు సాగించాల్సిన కనీసం 1,000 విమానాలు రద్దయ్యాయి. బ్రిటిష్ ఎయిర్వేస్, ఈజీజెట్, కేఎల్ఎం, లుఫ్తాన్సా వంటి ప్రముఖ ఎయిర్లైన్స్ సేవలపై ఈ ప్రభావం భారీగా పడింది.

