Last Updated:
టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో రూపొందుతున్న చిన్న, మధ్య తరహా చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రేమ, హాస్యం, సెంటిమెంట్, కుటుంబ అనుబంధాలను మేళవిస్తూ తెరకెక్కిన మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో రూపొందుతున్న చిన్న, మధ్య తరహా చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రేమ, హాస్యం, సెంటిమెంట్, కుటుంబ అనుబంధాలను మేళవిస్తూ తెరకెక్కిన మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ‘ప్రేయసి రావే’ ఫేమ్ దర్శకుడు మహేష్ చంద్ర తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

