అమెరికా శాంతి ప్రతినిధులు వెళ్లిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. మంగళవారం తెల్లవారుజామున రష్యా జరిపిన బాలిస్టిక్ మిసైల్ దాడుల కారణంగా కీవ్‌లోని పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగి భారీ నష్టం వాటిల్లింది. నివాస భవనాలు దెబ్బతినడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకోగా, కనీసం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని నగర మేయర్ విటాలీ క్లిచ్కో తెలిపారు. రష్యా క్షిపణి దాడుల ఉధృతితో సరిహద్దు దేశమైన పోలాండ్ కూడా తన వైమానిక రక్షణ వ్యవస్థలను అలర్ట్ చేసింది.
Source link
