Last Updated:
Viral Video: ప్రమాదం ఎలా సంభవిస్తుందో.. మృత్యువు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. జార్ఖాండ్‌లోని సీఎన్జీ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో జరిగిన ఊహించని ఘటన ఓ యువకుడి ప్రాణం తీసింది.
Viral Video: ప్రమాదం ఎలా సంభవిస్తుందో.. మృత్యువు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. జార్ఖాండ్‌లోని సీఎన్జీ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో జరిగిన ఊహించని ఘటన ఓ యువకుడి ప్రాణం తీసింది. కారులో గ్యాస్ నింపుతుండగా హోస్ పేలడంతో దానికి చివర ఉండే నాజిల్ తగిలి బంకులో పని చేస్తున్న 24 ఏళ్ల తుషార్ ఖమ్రి అక్కడిక్కడే చనిపోయాడు. వాహనదారులతో పాటు ఫిల్లింగ్ స్టేషన్లో పని చేసే ఉద్యోగులను అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియో హెచ్చరిస్తోంది. సీఎన్జీ స్టేషన్లో యజమానులు ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారో వాటిని తనిఖీ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

